కేంద్ర మంత్రులను కూడా వదలం….

కేంద్ర మంత్రులను కూడా వదలం....

దుబ్బాకలో టీఆర్ఎస్ స్థానాన్ని నిలబెట్టుకుంటామని, గతం కంటే మెరుగైన మెజార్టీ సంపాదిస్తామని మంత్రి కేటీఆర్ దీమా వ్యక్తం చేశారు. బీజేపీ సమాజంలో తక్కువ, సామాజిక మాధ్యమాల్లో ఎక్కువ అని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్, బీజేపీ దుబ్బాకలో డిపాజిట్‌లు కోల్పోయినా ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదని ఎద్దేవా చేశారు. కాషాయ పార్టీది డొల్ల ప్రచారమని.. దుబ్బాక గడ్డకు ప్రజా చైతన్యం ఉందని పేర్కొన్నారు. బీజేపీ నేతలు పోలీసులపై మాట్లాడిన భాషను ఖండిస్తూ న్నామని అన్నారు. తాము మాట్లాడితే పీఎం, కేంద్ర మంత్రులను వదలబోమని స్పష్టం చేశారు. తాము కూడా బూతులు మాట్లాడగలుగుతామని హెచ్చరించారు.

బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రూ.27,718 కోట్లను వ్యవసాయ రుణమాఫీ చేసినట్టు ఆర్బీఐ నివేదిక ఇచ్చిందని గుర్తు చేశారు. ఈ ఘనత కేసీఆర్ కి, మా ప్రభుత్వానికే దక్కుతుందని కొనియాడారు. రైతుబంధు రూపంలో రూ.28 వేల కోట్లు ఇచ్చామని.. రాష్ట్ర జీఎస్‌డీపీలో వ్యవసాయ రంగం కంట్రిబ్యూషన్ రెట్టింపు అయ్యిందని తెలిపారు. తెలంగాణలో తలసరి ఆదాయం అరేళ్లలో రెట్టింపు అయ్యిందని.. దివాళాకోరు ప్రతిపక్షాలు ఆర్బీఐ నివేదికను గుర్తిస్తాయో లేదో చూడాలని అన్నారు. ఏ ఎన్నిక వచ్చినా ప్రజలు కేసీఆర్‌కు జై కొడుతున్నారని గుర్తుచేశారు.