దేశ ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి.. తెలంగాణ మంత్రి కేటీఆర్ ట్విటర్ వేదికగా మరోసారి వ్యంగ్యం ప్రదర్శించారు. గత రెండు వారాల్లో.. దేశవ్యాప్తంగా దాదాపు 10రూ. పెరిగిన పెట్రో ధరలను ప్రస్తావిస్తూ కేటీఆర్ మంగళవారం ఉదయం ఓ ట్వీట్ చేశారు.
దేశంలో జీడీపీ దూసుకెళ్లడం లేదని ఎవరన్నారు? గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలు రోజూ పెంచుతూ.. జనాలకు దానిని ఒక అలవాటుగా మార్చినందుకు ప్రధాని మోదీగారికి ధన్యావాదాలు. బీజేపీలో మేధావులైన కొందరు నేతలు.. ఇప్పుడు ఇదంతా ఈవీలను ప్రమోట్ చేసేందుకు మోదీగారు చేస్తున్న మాస్టర్ స్ట్రాటజీ అని చెప్పుకుంటారు కూడా అని ట్వీట్ చేశారు కేటీఆర్.
ఇదిలా ఉండగా.. ఒకవైపు ధాన్యం కొనుగోలు అంశంపై కేంద్రం వర్సెస్ తెలంగాణ మధ్య వాడీవేడిగా విమర్శలు కొనసాగుతుండగా.. మరోవైపు ధరల పెంపుదలపై టీఆర్ఎస్ ప్రభుత్వం కేంద్రాన్ని నిలదీస్తోంది.