కోవిడ్ సమయంలో ఆపన్నులను వారి స్వగ్రామాలకు విమానాలు, రైళ్లు, బస్సులు ద్వారా వారి స్వగ్రామాలకు చేర్చి రియల్ హీరో అనిపించుకున్న సోనూసూద్ తన సేవా కార్యక్రమాలను ఇంకా కొనసాగిస్తూనే ఉన్నారు. గుండె ఆపరేషన్స్ చేయిండచం, ఆక్సిజన్ ప్లాంట్స్ పెట్టడం, ఉద్యోగాలు ఇప్పించడం, పేద విద్యార్థులకు చదువు చెప్పించడం వంటి ఎన్నో పనులు చేస్తున్నారు. ఈ క్రమంలో ఆయననై ఐటీ దాడులు కూడా జరిగాయి. ఈ దాడులపై తెలంగాణ మంత్రి కేటీఆర్ రీసెంట్గా స్పందించారు. తెలంగాణ ఇంపాక్ట్ గ్రూప్ ఆధ్వర్యంలో కోవిడ్ వారియర్స్‌కు సన్మాన కార్యక్రమం జరిగింది. ఇందులో కేటీఆర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయన సభలో ప్రసంగిస్తూ వ్యక్తిగా, సెలబ్రిటీగా సోనూసూద్ చేస్తున్న సేవలను కొనియాడారు.
అంతే కాకుండా సోనూసూద్ రాజకీయాల్లోకి వస్తాడనే భయం.. ఆయన వస్తే తమకెక్కడ ఇబ్బంది వస్తుందేమోనని ఆయనపై ఐటీ,ఈడీ దాడులు చేయించారు. అలాగే ఆయన ఇమేజ్ను తగ్గించే ప్రయత్నం చేశారు. కానీ సోనూసూద్ ఎవరికీ భయపడనక్కర్లేదు. ఆయనకు అండగా మేం ఉంటాం అని కేటీఆర్ తెలిపారు.సోషల్ మీడియాలో కామెంట్స్ చేయడం చాలా సులభమని ఈ సందర్భంగా ఆయన కొందరిని ఉద్దేశించి విమర్శలు చేశారు. అయితే సోనూసూద్‌పై జరిగిన ఐటీ దాడులను ఉద్దేశించి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. అలాగే సోనూసూద్ ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ కరోనా కారణంగా చాలా మంది వారి ఆత్మీయులను కోల్పోయారన్నారు. కేటీఆర్ వంటి నాయకుడు ఉంటే సమాజానికి తనలాంటి వారి అవసరం ఉండదని సోనూసూద్ తెలిపారు.
కోవిడ్ సమయంలో ఎందరికో అండగా నిలబడ్డ సోనూసూద్ పేరుని ప్రజలు తమ పిల్లలకు, షాప్స్‌కు పెట్టుకున్నారంటే ఆయనెంత ఇన్స్పైర్ చేశారో అర్థం చేసుకోవచ్చు. ఓ ఫౌండేషన్‌ను స్టార్ట్ చేసి ఉద్యోగాలు ఇతర సహాయ కార్యక్రమాలను కూడా అందిస్తున్నారు సోనూసూద్. గుండె జబ్బులున్న పిల్లలకు, పేదవారికి తన ఫౌండేషన్ ద్వారా సాయం చేస్తున్నాడు సోనూసూద్. గ్రూప్ 1, గ్రూప్ 2ల్లో ఉద్యోగాల కోసం చదవాలనుకుని స్తోమత లేని పేదవారి కోసం చదువుకు చెప్పించే కొత్త కార్యక్రమానికి కూడా సోనూసూద్ శ్రీకారం చుట్టారు.