రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదు

రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదు

సీఎం కేసీఆర్‌ మనవడు, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ తనయుడు కల్వకుంట్ల హిమాన్షు రావు చేసిన ట్వీట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. తాను ఎప్పటికీ రాజకీయాల్లోకి రానని మంగళవారం నాటి ట్విటర్‌ సందేశంలో హిమాన్షు పేర్కొన్నాడు. జులై 12న 16వ వసంతంలోకి అడుగుపెడుతున్న హిమాన్షు తన ఆకాంక్ష.. లక్ష్యాలు వేరని ట్విటర్‌ వేదికగా తెలిపాడు.

తన కలల ప్రపంచం.. లక్ష్యాలు వేరని, అందుకే రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదని స్పష్టం చేశాడు. లక్ష్యాలు సాధించుకోవడంపైనే దృష్టి పెడుతున్నానని చెప్పుకొచ్చాడు. తన బర్త్‌డే సందర్బంగా ఎవరూ పూల బొకేలు పంపొద్దని.. దాని బదులు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని హిమాన్షు కోరాడు.