మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపైఒక బహిరంగ లేఖ రాశారు. 400 ఎకరాల భూమిని రక్షించేందుకు అందరూ ఐక్యంగా నిలబడాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. తాను ఓ రాజకీయ నాయకుడిగా కాకుండా సాధారణ పౌరుడిగా, ప్రకృతి ప్రేమికుడిగా అటవీ భూములతో పాటు వన్య ప్రాణులను సంరక్షించుకునేందుకు పోరాటం కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నట్లు లేఖలో రాసుకొచ్చారు. పర్యావరణాన్ని కాపాడేందుకు ముందుకొచ్చిన విద్యార్థులు, పర్యావరణ ప్రేమికులు, మేధావులు, జర్నలిస్టులకు తాను కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని లేఖలో పేర్కోన్నారు.