కుంభమేళా.. ఓ ప్రపంచ చరిత్ర: వెంకయ్య నాయుడు

భారత మాజీ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు
భారత మాజీ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు

భారత మాజీ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు శుక్రవారం నెల్లూరు జిల్లా, వెంకటాచలంలోని స్వర్ణభారత్ ట్రస్ట్‌ లో వృత్తి విద్యా శిక్షకులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కుంభమేళాలో జరుగుతున్న తీరు ఓ ప్రపంచ చరిత్రగా అభివర్ణించారు. 45 కోట్ల మంది కుంభమేళలో పవిత్ర స్నానం చేయడం ఒక్క భారతదేశంలోనే జరుగుతుందన్నారు. విద్యార్థులు ఇంగ్లీష్ మీడియం చదువుకోవాలని.. అలాగే తెలుగు సంస్కారం అలవార్చుకోవాలని సూచించారు. మారుతున్న తరానికి అనుగుణంగా యువతలో మార్పురావాలని వెంకయ్యనాయుడు ఆకాంక్షించారు.