కేవీపీ మళ్లీ జగన్ కు దగ్గరయ్యారా..?

KVP Again Approached To Jagan

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

KVP  Again Approached To Jagan

వైఎస్ చనిపోవడానికి ముందు వరకు కేవీపీ జగన్ తో సన్నిహితంగా ఉండేవారు. జగన్ కూడా వైఎస్ మాట వినకపోయినా.. కేవీపీ మాటకు విలువిచ్చేవారనే ప్రచారం అప్పట్లో జరిగింది. కానీ సోనియాను విభేదించాలన్న జగన్ నిర్ణయంతో మాత్రం కేవీపీ ఏకీభవించలేదు. అందుకే అప్పట్లో కేవీపీపై జగన్ విమర్శలు చేసినా.. ఆయన మాత్రం మౌనంగానే ఉన్నారు. ఇప్పుడు మళ్లీ క్రియాశీలకంగా మారారట.

జగన్ కు రాజకీయ అండదండలు అందిస్తున్నారని, నంద్యాల ఉపఎన్నికల వ్యూహరచన ఆయనే చేస్తున్నారని చెప్పుకుంటున్నారు. అసలు సీనియర్ల మాట లెక్కచేయని జగన్.. ఈ మధ్య కేవీపీ చెప్పిన పనులు చేస్తున్నారని, అందుకు శిల్పా చేరికే ఉదాహరణ అని అంటున్నారు. అదే నిజమైతే చంద్రబాబు బ్రెయిన్ కు దీటైన బ్రెయిన్ దొరికినట్లేనని గుసగుసలు వినిపిస్తున్నాయి.

నిజంగా జగన్ కేవీపీ చెప్పినట్లు వింటారా అనే విషయం పక్కనపెడితే శిల్పా ఎపిసోడ్ లో మాత్రం టీడీపీకి కూడా కొన్ని డౌట్స్ ఉన్నాయట. అందుకే ఎందుకైనా మంచిదని చంద్రబాబు నంద్యాలలో స్వయంగా రంగంలోకి దిగారనే మాట వినిపిస్తోంది. కానీ మంచి ఫేస్ వాల్యూ లేని నేత లేకుండా కేవీపీ రాణించలేరని, ఇప్పుడు జగన్ కు గతంలో వైఎస్ అంత స్థాయి లేదని టీడీపీ నేతలు లైట్ తీసుకుంటున్నారు.

మరిన్నివార్తాలు:

వడ్డీకాసులవాడికి ఆదాయం లేదా..?

తెలంగాణ అనధికార సీఎం కేటీఆర్