కేవీపీ కి పోలవరం పూర్తి కావడం ఇష్టం లేదా.

KVP-wrote-letter-to-Chandra

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
మనసు వైసీపీ లో మనిషి కాంగ్రెస్ లో కొనసాగుతున్న వై.ఎస్ ఆత్మ మొదటినుంచి పోలవరం ప్రాజెక్టు మీద ప్రత్యేక ఆసక్తి చూపిస్తున్నారు. అయితే అది పూర్తి కావాలని ఆయన ఆరాట పడుతున్నారు అనుకుంటే పొరపాటే. ప్రాజెక్ట్ కాంట్రాక్టు విషయంలో ఆయన ఎన్నో ఆశలు పెట్టుకుంటే అది దక్కకుండా పోయిందని కేవీపీ తెగ ఫీల్ అయిపోతున్నారంట. పోలవరం గురించి సీఎం చంద్రబాబుకు తాజాగా కేవీపీ ఓ సలహా ఇచ్చారు. పోలవరం సమస్యకు పరిష్కారం దొరకాలంటే ఉన్నత న్యాయస్థానంలో కేసు వేయమని చంద్రబాబుకు కేవీపీ ఇచ్చిన సలహా చూసి ఆయనకు ఈ ప్రాజెక్ట్ పూర్తి కావడం ఇష్టం లేదని అనుకోవచ్చు. కోర్టుకి వెళ్లడం తప్పు కాకపోయినా ఒక్కసారి కోర్టు మెట్లు ఎక్కాక ఆ ప్రక్రియ పూర్తి అయి పోలవరం నిర్మాణం చేయడానికి ఎంత టైం పడుతుందో ఎవరిని అడిగినా చెబుతారు. కానీ కేవీపీ ఇదే సలహా ఇస్తూ చంద్రబాబుకి రాసిన లేఖ మీరు కూడా చదవండి.

KVP letter about Polavaram