రోజా మాటలపై సోషల్‌ మీడియాలో ఆగ్రహం

roja comments on bandla ganesh over pawan kalyan,

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

వైకాపా ఎమ్మెల్యే, ఫైర్‌ బ్రాండ్‌ రోజా మరోసారి తన మాటల వేడిని రగిల్చారు. ఈసారి పవన్‌ కళ్యాణ్‌పై తీవ్ర స్థాయిలో అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడంతో ఆమెపై సోషల్‌ మీడియాలో తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం అవుతుంది. పవన్‌ కళ్యాణ్‌ను వాడు వీడు అంటూ మాట్లాడటం ఏమాత్రం సరైన విధానం కాదు అంటూ బండ్ల గణేష్‌ తాజాగా ఒక టీవీ ఛానెల్‌ చర్చలో పాల్గొన్న సందర్బంగా అన్నాడు. అదే సమయంలో పవన్‌ కళ్యాణ్‌ గురించి తాను చేసిన వ్యాఖ్యలను సమర్ధించుకునేందుకు అదే టీవీ ఛానెల్‌ లైవ్‌కు ఫోన్‌ ద్వారా రోజా వచ్చింది. ఆ సమయంలో బండ్ల గణేష్‌ మరియు రోజా మద్య మాటల యుద్దం జరిగిందని చెప్పుకోవచ్చు.

రోజాను ఐరెన్‌ లెగ్‌ అంటూ బండ్ల గణేష్‌ విమర్శించడంతో సహనం కోల్పోయిన రోజా నువ్వు పవన్‌ కళ్యాణ్‌కు పక్కలు వేస్తావు అంటూ తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేసింది. ఆ వ్యాఖ్యలపై ప్రస్తుతం సోషల్‌ మీడియాలో దుమారం లేస్తోంది. ఇద్దరి మద్య మాటలు ముదిరి పవన్‌పైకి రావడంతో పవన్‌ ఫ్యాన్స్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పవన్‌ వంటి ఒక గొప్ప వ్యక్తి గురించి మాట్లాడే సమయంలో రోజా ఎంతో జాగ్రత్తగా మాట్లాడాలి. కాని ఆమె నోరు జారి చాలా దారుణమైన కామెంట్స్‌ చేసిందని, ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తిగా మాట్లాడకుండా రోజా ప్రవర్తించింది అంటూ సోషల్‌ మీడియాలో ఆమెను ఉద్దేశించి జనాలు అంటున్నారు. రోజా వ్యాఖ్యలు ఏమాత్రం సమర్ధనీయం కావు అని పవన్‌ ఫ్యాన్స్‌తో పాటు అంతా కూడా అంటున్నారు.