మోడీ తినే ఒక్క పుట్టగొడుగు ఖరీదు 80 వేలు.

Alpesh Thakor comments on Modi food

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
ప్రధాని మోడీ తాను కింది స్థాయి నుంచి వచ్చినవాడినని అవకాశం వచ్చిన ప్రతిసారి చెప్పుకుంటారు. ఇప్పుడు గుజరాత్ ఎన్నికల సందర్భంలో అయితే ఇంకో అడుగు ముందుకు వేసి తనపై చేసే ప్రతి విమర్శని మొత్తం గుజరాత్ కి ముడిపెడుతున్నారు. దీంతో మోడీ ప్రచార పర్వంలో ఎంత నేర్పుగా వుంటారో ప్రతి ఒక్కరికీ అర్ధం అవుతోంది. అయితే దీన్ని కౌంటర్ చేయడానికి ఏ వ్యూహం అమలు చేయాలి అన్నదానిపై కాంగ్రెస్ ఓ నిర్ణయానికి వచ్చింది. కిందిస్థాయి వాడినని చెప్పుకోడానికి మోడీ తాపత్రయపడతారు తప్ప ఆయన అలవాట్లు, అభిరుచులు బాగా ఖరీదైనవి అని నిరూపించేందుకు కాంగ్రెస్ పక్కాగా ప్లాన్ చేసుకుంది. ఇంతకుముందు మోడీ వేసుకునే బట్టలు ఎంత ఖరీదు అయినవో బయటకు వెల్లడించిన కాంగ్రెస్ ఈసారి ఆయన ఆహారపు అలవాట్ల మీద కన్నేసింది.

Modi-and-alpesh-thakor

ప్రతి విషయం లో తాను గుజరాతీ అని చెప్పుకునే మోడీ ఆహారపు అలవాట్లు అందుకు భిన్నంగా వుంటాయని కాంగ్రెస్ నేత అల్పేష్ ఠాకూర్ చెప్పారు. గుజరాతీలు అంతగా ఇష్టపడని పుట్టగొడుగు అంటే మోడీకి బాగా ఇష్టమని అల్పేష్ అంటున్నారు. అవి కూడా దేశీయంగా లభించే పుట్టగొడుగులు కన్నా తైవాన్ నుంచి తెప్పించినవి మాత్రమే మోడీ తింటారట. తైవాన్ నుంచి వచ్చే ఆ పుట్టగొడుగు ఖరీదు ఒక్కోటి 80 వేల రూపాయలట. ఈ లెక్కన చూస్తే మోడీ నెలవారీ తిండి ఖర్చు కోటి ఇరవై లక్షలుగా తేల్చారు అల్పేష్ ఠాకూర్. అతి సామాన్యుడినని చెప్పుకునే మోడీ తిండి ఖర్చు ఇలా ఉంటే ఇక మిగిలిన ఖర్చులు ఎలా వుంటాయో మీరే వూహించుకోమని గుజరాతీలకు పరీక్ష పెడుతున్నాడు అల్పేష్ కుమార్. మొత్తానికి మోడీ కి వున్న కామన్ మ్యాన్ ఇమేజ్ కి గండి కొట్టేందుకు ఈసారి కాంగ్రెస్ కొత్త కొత్త అస్త్రాలతో జనం ముందుకు వస్తోంది.