Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
అమ్మాయిల్లో ఆల్కహాల్ సేవించే అలవాటు ఎక్కువవుతోందని, ఇది తనకెంతో భయాన్ని కలిగిస్తోందని గోవా ముఖ్యమంత్రి మనోహర్ చేసిన వ్యాఖ్యలపై కొందరు మహిళలు మండిపడుతున్నారు. మనోహర్ పారికర్ పై సోషల్ మీడియాలో అమ్మాయిలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. పలువురు గార్ల్స్ హు డ్రింక్ బీర్ హ్యాష్ ట్యాగ్ జోడించి పారికర్ కు వ్యతిరేకంగా ట్వీట్లు చేస్తున్నారు. అమ్మాయిలు బీరు తాగడాన్ని మాత్రమే చూశానని ఆయన చెబుతున్నారని, ఇక మహిళలు పోర్న్ మూవీస్ చూస్తారని, సిగరెట్లు తాగుతారని ఆయనకు తెలిస్తే నెలల తరబడి నిద్రపోరేమేనని ఒక అమ్మాయి ట్వీట్ చేసింది.
ప్రధాని మహిళను చూసి నవ్వుతారు, పారికర్ అమ్మాయిలను చూసి భయపడతారు, యోగి మహిళలను ఇంటికే పరిమితం చేయాలంటారు…వీరా మన పాలకులు అని మరొక అమ్మాయి విరుచుకుపడింది. బీరు తాగే అమ్మాయిలను చూస్తుంటే భయమేస్తుందనే పారికర్ మహిళలపై జరుగుతున్న అకృత్యాల గురించి ఎందుకు మాట్లాడడం లేదని కొందరు ప్రశ్నించారు. ఎనిమిది నెలలపాటు రేప్ కు గురైన అమ్మాయిసంగతి తెలియదా…? పరువు హత్యలు కనిపించడం లేదా..? పట్టపగలు బస్సుల్లో లైంగిక వేధింపులు తెలియవా..? అవన్నీ పారికరన్ ను భయపెట్టవా అని కొందరు అమ్మాయిలు కామెంట్లు చేస్తున్నారు. ఓ అమ్మాయిగా బీరు తాగడం నాకిష్టం అంటూ పలువురు అమ్మాయిలు పారికర్ వ్యాఖ్యలను నిరసిస్తూ బీరు తాగుతున్న ఫొటోలు పోస్ట్ చేస్తున్నారు.