పెద్దపల్లి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఒక మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. మరో చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి.పెద్దపల్లి జిల్లా కేంద్రంలో కమాన్ వద్ద స్కూటీ పై వెళ్తున్న కమాన్ పూర్ ASI భాగ్యలక్ష్మీని లారీ అత్యంత వేగంగా వచ్చి వెనకనుంచి ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో స్కూటీ పై ప్రయాణిస్తున్న ఆమె అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యింది.
మరోవైపు ASI భాగ్యలక్ష్మి కూతురికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు వెంటనే చిన్నారిని ఆసుపత్రికి తరలించారు.ప్రమాదానికి కారణమైన లారీ గుజరాత్ కు చెందినదిగా పోలీసులు గుర్తించారు. డ్రైవర్ పరారీలో ఉన్నాడు.. పోలీసులు కేసు నమోదు చేసుకుని డ్రైవర్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.