మహిళ కానిస్టేబుల్‌ ఆత్మహత్య

మహిళ కానిస్టేబుల్‌ ఆత్మహత్య

పుణెలో జయభాయి అనే మహిళ కానిస్టేబుల్‌ ఆత్మహత్య చేసుకుంది. పుణె సిటీ పోలీస్‌ స్పెషల్‌ భ్రాంచ్‌ విభాగంలో విధులు నిర్వహిస్తున్న జయభాయి సోమవారం రాత్రి ఉరేసుకొని తనువు చాలించింది. మృతురాలికి ఒక కుమర్తె ఉన్నారు. ఆదివారం తన విధులును ముగించుకుని ఇంటికి వెళ్లే ముందు, ఆమె తన కుమార్తెను బంధువుల ఇంట్లో వదిలివెళ్లింది. సోమవారం ఆమె స్నేహితుడు ఇంటికి వెళ్లి చూడగా డోర్‌ లోపల నుంచి లాక్‌ చేసి ఉంది.

దీంతో అనుమానం వచ్చి అతడు వాకాడ్ పోలీస్ స్టేషన్‌ కు సమాచారం ఇచ్చాడు. పోలీసులు ఆమె ఇంటి తలుపు తెరిచి చూడగా.. జయభాయి విగతజీవిగా ఉరికి వేలాడుతూ కనిపించించింది. పోలీసులు కేసు నమోదు చేసి, ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం నిమత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ విషయాన్ని కేరళలో ఇండియన్‌ నేవిలో పనిచేస్తున్న ఆమె భర్తకు తెలియజేశారు. పోలీస్ ఇన్స్‌పెక్టర్‌ వివేక్ ముగ్లికర్ మాట్లాడుతూ సంఘటన స్థలంలో ఎంటువంటి సూసైడ్ నోట్ లభ్యం కాలేదని, దర్యాప్తు కొనసాగుతోందని అన్నారు.