మహిళా పోలీసులకు ఉదయం నుంచి తీవ్ర ఇబ్బందులు

మహిళా పోలీసులకు ఉదయం నుంచి తీవ్ర ఇబ్బందులు

జగన్ మోహన్ రెడ్డి మూడు రాజధానుల ప్రకటన వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ రాజధాని అమరాతి పరిధిలో రైతులు, మహిళలు, యువత నిర్వహిస్తున్న సకల జనుల స-మ్మె రోజు రోజుకు ఉదృతం అవుతోంది. ఓ పక్క ప్రభుత్వం నియమించిన కమిటీల నివేదికలు, మరో పక్క పోలీసులు వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా చేపట్టిన మహా ధ-ర్నాలు, రహదారుల దిగ్బం-ధనాలు, రిలే దీక్ష-లతో రాజధాని ప్రాంతం మారుమోగుతుంది.

పోలీసుల తీరుకు నిరసనగా రైతులు, రైతు కూలీలు శనివారం బందను చేపట్టారు. రాజధాని గ్రామాల్లో స్వచ్ఛందంగా బం-ద్ కొనసాగింది. ఈ రోజు కూడా పోలీసుల తీరుకు నిరసనగా సహాయ నిరాకరణ చేపట్టాలని రాజధాని గ్రామాల ప్రజలు నిర్ణయించారు. మంచినీరు, కాఫీ, టీలు, భోజనాది సౌకర్యాలు కల్పించకూడదని నిర్ణయించారు. చివరకు తమ దుకాణాల ముందు కూర్చోవ డానికి కూడా రైతులు ఒప్పుకోకపోవడం పరిస్థితికి అద్దం పడుతోంది. తమ గ్రామాల మీదుగా పోలీసు వాహనాలను వెళ్లకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు.

శాంతియుతంగా నిర-సన చేస్తున్న తమ పట్ల పోలీసులు అనైతికంగా వ్యవహరించారంటూ మహిళలు విరుచుకుపడ్డారు. రైతుల తీరుతో, తాగేందుకు నీళ్ళు కూడా ఇవ్వకపొవటంతో, పోలీసులు షాక్ అయ్యారు. ముఖ్యంగా మహిళా పోలీసులకు ఈ ఉదయం నుంచి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సహాయ నిరకరణ ఉద్య-మం అంటే ఇలా ఉంటుందా అని వాపోతున్నారు. చివరకు తమతో మాట్లాడటానికి కూడా ప్రజలు ఇష్టపడటం లేదని, తమను చూస్తేనే ముఖం తిప్పేసుకుని వెళ్లిపోతున్నారని మహిళా పోలీసులు అంటున్నారు. ఇక చేసేది లేక, పోలీసులకు కావలసిన అవసరాలు, విజయవాడ నుంచి తెప్పించుకుంటున్నారు. మహిళలపై పోలీసులు ప్రవర్తనకు నిరసనగా మందడంలో రైతులు, మహిళలు ఉదయమే రహదారిపైకి వచ్చి బైఠా-యించి నిరసన తెలిపారు.

రహదారి అంతటా పరదాలు పరచి రాకపోకలను పూర్తిగా స్తంభింప-జేశారు. సీడి యాక్సిస్ రోడ్డుపై ఆయా ప్రాంతాలకు చెందిన రైతులు బైఠా-యించి రహదా రిని దిగ్బం-ధనం చేశారు. మహిళలపై పోలీసుల తీరుకు నిరసిస్తూ వెలగపూడి నుంచి మందడం గ్రామం వరకు మహిళలు, చిన్నారులు, రైతులు పెద్ద ఎత్తున ర్యా-లీ నిర్వహించారు. దొండపాడులో రైతు మృతికి మందడం గ్రామస్తులు సంతాపం ప్రకటించారు.

మందడంలో జరిగిన మహా ధర్నాలో పీసీసీ ఉపాధ్యక్షురాలు సుంకర పద్మశ్రీ సంఘీభావం తెలిపి ప్రభుత్వ ధోరణిని ఎండగట్టారు. తాళ్లాయిపాలెంలో అంబేద్కర్, వైఎ స్ఆర్, ఎన్టీఆర్ విగ్రహాలకు ఆ ప్రాంత రైతులు, మహిళలు ప్రభుత్వం తీసుకున్న మూడు రాజధా నుల నిర్ణయాన్ని ఉప సంహరించుకోవాలంటూ వినతిపత్రాలు అందించారు. అమరా వతి రాజధానిని కొనసాగించాలని డిమాండ్ చేశారు. అభివృద్ధి వికేంద్రీకరణకు తాము ఎటు వంటి అభ్యంతరం తెలుపమని, అన్ని ప్రాంతాలు సమాన అభివృద్ధి సాధించాలన్నదే తమ అభిమత మని స్పష్టం చేశారు.