మహిళా సైకో తెగింపు… పెట్రోలింగ్ కారులోనే దారుణమైన పని

అమెరికాలో ఓ లేడీ సైకో అరాచకం సృష్టించింది. పోలీస్ ముఖంపై దగ్గి, పెట్రోలింగ్ కారులో పాడుపని చేసింది ఓ మహిళ. ఆ మహిళ అరాచకం పోలీస్ అధికారికి చిరాకు తెప్పించింది. ఓ లేడీ సైకో అరాచకమంటే ఏంటో చూపించింది. వైద్యసాయం నిరాకరించిన మహిళ పోలీస్ అధికారి ముఖంపై దగ్గుతూ భయభ్రాంతులకు గురిచేసింది. తనకు కరోనా ఉందని.. ఇప్పుడు నీకు కూడా ఉందంటూ కేకలు వేస్తూ నానా హంగామా చేసింది.

ఆ తర్వాత పోలీసులు ఆ మహిళను పెట్రోలింగ్ కారులో తీసుకుని వెళ్తుండగా.. కారులో మూత్రం పోసి నానా రభస చేసింది. దీంతో పోలీసులకు చిర్రెత్తికొచ్చింది. పోలీసులు.. ఆమెను నేరుగా జైలుకి తీసుకెళ్లి కటకటాల వెనక్కి నెట్టాడు. దీంతో పాటు తీవ్రవాద చర్యలకు పాల్పడడం, వేధింపులు వంటి అభియోగాలు మోపారు. ఇలాంటి షాకింగ్  ఘటన అమెరికాలో చోటుచేసుకోవడంపై సమాజం విస్తుపోతుంది.

పెన్సిల్వేనియాలోని హోస్టన్‌కి చెందిన జెస్సికా హార్వే(37) పోలీసులకు చుక్కులు చూపింది. మొదట ఇంట్లో గొడవ జరుగుతుందని తెలియడంతో ఓ పోలీస్ ఆఫీసర్ అక్కడికి వెళ్లాడు. అయితే అక్కడ ఎవరూ లేకపోవడంతో వెనుదిరిగాడు. తిరిగి మరుసటి రోజు అక్కడికి సమీపంలోనే ఓ మహిళ శరీరంపై గాయాలతో.. చిందర వందరగా ఉన్న బట్టల్లో పోలీస్ అధికారికి దర్శనమిచ్చింది. వెంటనే స్పందించిన పోలీస్.. ఆమెకి సాయం చేద్దామని అనుకున్నాడు. శరీరంపై గాయాలున్నాయని.. ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్యసాయం ఇప్పిస్తానని చెప్పడంతో.. జెస్సికా అందుకు నో చెప్పింది. తనకు ఏ వైద్యసాయం అవసరం లేదని స్పష్టం చేసింది. ఆమె ఎందుకిలా అంటుందో తెలియని ఆ ఆఫీసర్ వివరాలు చెక్ చేయడంతో ఆమెపై అప్పటికే చాలా అరెస్టు వారెంట్లు పెండింగ్‌లో ఉన్నట్లు తేలింది.