Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఈరోజు ఉదయం నుండి కర్నాటకలో అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ క్షణ క్షణం ఉత్కంఠ భరితంగా సాగింది. ఫలితాల్లో ప్రధాన పార్టీల ఫలితాలు ఆసక్తికరంగా మారాయి. అయితే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ వచ్చే అవకాశాలు లేవని వివిధ సర్వేలు ముందు నుండే వెల్లడించాయి. అయితే కొన్ని సంస్థలు బీజేపీ కి ఎక్కువ, కొన్ని సంస్థలు కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ సీట్లు వస్తాయని చెప్పినప్పటికీ… ఈ రెండు పార్టీలకు జేడీఎస్ మద్దతే కీలకం కానుందని దాదాపు అన్ని సర్వేలు స్పష్టం చేశాయి. ఈ నేపధ్యంలో ఈరోజు వెలువడుతున్న ఎన్నికల ఫలితాలు అందుకు అనుగుణంగానే ఉన్నాయి.
ఇండియా టుడే, సువర్ణ న్యూస్ చేసిన సర్వేల్లో కాంగ్రెస్ కి అత్యధిక సీట్లు అని, న్యూస్ నేషన్, న్యూస్ ఎసెక్ష్ సర్వేలలో బీజేపీకి అత్యధిక సీట్లు అని చెప్పినా చివరికి ఒక తెలుగు మీడియాలో పేరు చెప్పకుండా ప్రచురించిన ఒక సర్వే ఫలితాలు మాత్రం దగ్గరదగ్గరగా వచ్చాయి. సదరు పత్రిక పేరు ఎక్కాడా ప్రస్తావించకపోయినా అది లగడపాటి సర్వేనే అనే ప్రచారం గట్టిగా సాగింది. లగడపాటి కూడా దానిని ఖండించక పోవడం ఈ సర్వే ఆయనదే అని అందరు ఫిక్స్ అయిపోయారు. పూర్తిగా కాకపోయినా ఒక ఐదారు సీట్లు అటూ ఇటుగా ఆయన చెప్పిన సీట్లే పార్టీలు సాధించడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
ఆ సర్వే ప్రకారం ఈసారి కర్నాటకలో గెలుపు బీజేపీదేనని స్పష్టం చేశారు. ఆ పార్టీకి 110-120 స్థానాలు వస్తాయని అంచనా వేశారు. కాంగ్రెస్ కు 70-80, జేడీఎస్ కు 40వరకూ సీట్లు దక్కుతాయని తేల్చారు. కొంతకాలం వరకూ కాంగ్రెస్ లీడింగ్ లో ఉన్నా… ఇప్పుడు మాత్రం ఆ పార్టీ వెనుకబడిందని, బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని లగడపాటి సర్వే జోస్యం చెప్పింది. అయితే లగడపాటి చెప్పినటు బీజేపీకి 110-120 కాకుండా 104, కాంగ్రెస్ కి 70-80 అంటే 78, జేడీఎస్ కు 40 సీట్లు అంటే 38 సీట్లు సంపాదించి మరలా ఆయన వార్తలలోకి ఎక్కినట్లు అయ్యింది.