దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 2 లక్షల 58వేల 89 కేసులు నమోదయ్యాయి. 385 మంది మృతి చెందారు. లక్షా 58వేల 750 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.
ఇక ఒమిక్రాన్ కేసుల సంఖ్య 8వేల 209కి చేరింది. దేశంలో ప్రస్తుతం 16 లక్షల 54వేల 361 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. కరోనా పాజిటివిటీ రేటు 19 శాతానికి పెరిగింది. భారత్లో ఇప్పటివరకు 157 కోట్ల మందికి పైగా వ్యాక్సిన్ వేయించుకున్నారు.