ఐశ్వర్యా రాయ్ తో తేజ్ పెళ్లి

Tej pratap marriage with Aishwarya Rai

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

సమోసా లో ఆలూ ఎప్పటిదాకా ఉంటుందో అప్పటి దాకా బీహార్ లో లాలూ ఉంటాడు అని స్వయంగా లాలూనే ప్రకటించుకున్నాడు. అలంటి లాలూ ఇంటికే కాక మొత్తం బిహార్ కే యువరాజుగా ఆర్జేడీ అభిమానులు భావించే తేజ్ ప్రతాప్ యాదవ్ వివాహం ఖరారు అయ్యింది. తేజ్ వివాహం వచ్చే నెలలో బీహార్ మాజీ ముఖ్యమంత్రి ప్రసాద్ రాయ్ మనవరాలు ఐశ్వర్యరాయ్ తో జరగనుంది. దాదాపు పది నెలల క్రితం తన ఇద్దరు కుమారులకూ వివాహ ప్రయత్నాలు ప్రారంభించినట్టు లాలూ ప్రసాద్ యాదవ్ సతీమణి రబ్రీ దేవి ప్రకటించారు. తన ఇంటి కోడలి వచ్చే మహిళ ఎలా ఉండాలన్న విషయంపై గతంలో ఆమె చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కావటం తెలిసిందే.

అప్పటి నుండి సంబంధాలు చూడగా ఇప్పుడు వారింట్లో కోడలిగా ఐశ్వర్య అడుగు పెట్టనుంది. ఐశ్వర్య కుటుంబ నేపథ్యంలో చూస్తే.. ఆమె తాత మాజీ ముఖ్యమంత్రి కాగా.. యాదవ సామాజిక వర్గం నుంచి సీఎంగా పని చేసిన మొదటి నేత ఆయనే. ఇక.. ఐశ్వర్య తండ్రి చంద్రికా రాయ్ కూడా బిహార్ రాష్ట్ర మంత్రిగా వ్యవహరించారు. ఐశ్వర్యరాయ్ ఢిల్లీ యూనివర్శిటీలో హిస్టరీ గ్రాడ్యుయేట్. ఇక వీరిద్దరి నిశ్చితార్థం ఈ నెలాఖరులోగా, పెళ్లి వచ్చే నెలలో జరుగుతుందని తెలుస్తోంది. ఇక ఈ యువజంట వివాహం పాట్నాలోని వెటర్నరీ కాలేజ్ మైదానంలో జరుగుతుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ పెళ్లి అంగరంగ వైభవంగా సాగనుండగా, దేశవ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీలు, ప్రాంతాలకు చెందిన వీఐపీలు పాల్గొని వధూవరులను ఆశీర్వదించనున్నారని పార్టీ వర్గాల సమాచారం.