సీఎం కి తృటిలో తప్పిన ప్రమాదం…ముగ్గురికి గాయాలు

సీఎం కి తృటిలో తప్పిన ప్రమాదం...ముగ్గురికి గాయాలు

విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గగుడి సమీపంలో ఒక్కసారిగా కొండచరియలు విరిగిపడ్డాయి. గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు బీటలు వారి కొండ చరియలు విరిగిపడుతున్నాయి. ఈ ఘటనలో ముగ్గురికి గాయాలయ్యాయి. శిథిలాల కింద ఎవరైనా చిక్కుకున్నారా? లేదా? అనే విషయంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. కొండ చరియలు విరిగిపడటంతో ఓ రేకుల షెడ్డు పూర్తిగా ధ్వంసమైంది.

దసరా ఉత్సవాలను పురస్కరించుకుని కనకదుర్గ అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించేందుకు కాసేపట్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంద్రకీలాద్రికి‌ రానున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో ఆ ప్రదేశంలో రాకపోకలు నిలిపివేయడంతో పెనుప్రమాదం తప్పింది. కొండ చరియలు విరిగిపడటంపై మీడియా హెచ్చరించినా.. అధికారులు కేవలం హెచ్చరిక బోర్డులు పెట్టి వదిలేశారని ఆరోపణలు వస్తున్నాయి.మరికాసేపట్లో సీఎం జగన్మోహన్ రెడ్డి ఇంద్రకీలాద్రికి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో అధికారులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. మీడియా పాయింట్ దగ్గరలోనే ఈ కొండచరియలు విరిగిపడ్డాయి.