భారీ వర్షాల కారణంగా విజయవాడలో కొండ చరియలు విరిగి పడిన ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు. విద్యాధరపురం నాలుగు స్తంభాల సెంటర్లో నివాసాలపై కొండచరియలు విరిగిపడటంతో ఇల్లు ధ్వంసమైంది.
దాంతో ఆ ఇంట్లో నివాసముంటున్న వ్యక్తి మట్టిలో కూరుకుపోయాడు. మట్టి పెళ్లలను తొలగించి అంబులెన్స్‌లో హుటాహుటిన ఆస్పత్రికి తీసుకెళ్లినాఫలితం లేకపోయింది. తీవ్ర గాయాలపాలైన బాధితుడు చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోమయాడు.