ఈ ఏడాది చివరి సూర్య గ్రహణం

ఈ ఏడాది చివరి సూర్య గ్రహణం

ఈ ఏడాది చివరి సూర్య గ్రహణం డిసెంబర్‌ 4న ఏర్పడనుంది. ఈ సూర్య గ్రహణం అంటార్కిటికా, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, దక్షిణ అమెరికాలో కనిపిస్తుందని, అయితే ఈ గ్రహణం భారతదేశంలో కనిపించదని ఖగోళ నిపుణులు తెలిపారు. భారత కాలమాన ప్రకారం డిసెంబర్‌ 4న ఉదయం 10.59 గంటలకు ప్రారంభమై.. మధ్యాహ్నం 3.07 గంటలకు ముగియనున్నది. సూర్యుడు, భూమి, చంద్రుడు ఒకదానితో ఒకటి సమాంతరంగా వచ్చినప్పుడు సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడుతుంది. ఆ సమయంలో చంద్రుడు సూర్యుడిని పూర్తిగా కప్పేస్తాడు.

కొన్ని నిమిషాలు లేదా సెకండ్ల పాటు ఆకాశం చీకటిగా మారిపోయి, రాత్రిని తలపిస్తుంది. ఖగోళంలో జరిగే అరుదైన మార్పుల వల్లే సంపూర్ణ సూర్య గ్రహణాలు ఏర్పడతాయి. ఈ ఏడాది రెండు చంద్రగ్రహణాలు, మరో రెండు సూర్యగ్రహణాలు ఏర్పడుతాయి ఈ మే 26న తొలి చంద్రగ్రహణం, నవంబర్‌ 19న రెండో చంద్రగ్రహణం ఏర్పడింది. ఇక జూన్‌ 10న తొలి సూర్యగ్రహణం ఏర్పడగా.. వచ్చే నెల డిసెంబర్‌ 4న మరో సూర్యగ్రహణం సంభవించనున్నది. ఈ నెల 19న 580 సంవత్సరాల తర్వాత సుదీర్ఘకాల అరుదైన పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడింది.