అందం, అభినయం ఆమె సొంతం. తన నటనతో ఎన్నో మరుపరాని చిత్రాల్లో నటించి వెండితెరపై ఎవర్గ్రీన్ హీరోయిన్గా పేరు తెచ్చుకున్నారు. కేవలం తెలుగు వారి గుండెల్లోనే కాకుండా దేశ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు. అందుకే ఆమె ఈ లోకాన్ని వీడిచి రెండేళ్లు దాటినా.. ఆ పేరు చెబితే ఇప్పటికీ అదే క్రేజ్. ఇంతకీ ఆమె ఎవరో కాదు..అందాల తార శ్రీదేవి. నేడు ఈ అతిలోక సుందరి 57వ జయంతి. కాగా 2018 ఫిబ్రవరిలో దుబాయ్‌లోని ఓ హోటల్లో ప్రమాదవశాత్తు శ్రీదేవి కన్నుమూసిన విషయం తెలిసిందే.
శ్రీదేవి జయంతి సందర్బంగా సినీ ఇండస్ట్రీతోపాటు అభిమానులు ఆమె తాలూకూ జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ కపూర్ తన తల్లిని మదిలో గుర్తు చేసుకుంటూ తనపై ఉన్న ప్రేమను చాటుకున్నారు. ‘హ్యపీ బర్త్‌డే ముమ్మ.. లవ్ యూ’ అంటూ.. తల్లితో దిగిన ఫోటోలను ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో షేర్ చేశారు. అలాగే శ్రీదేవి పుట్టినరోజు సందర్భంగా బాలీవుడ్ ప్రముఖులు ఆమెతో తమ జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. “లెజెండ్కి పుట్టినరోజు శుభాకాంక్షలు” అని కార్తీక్ ఆర్యన్ జాన్వీ పోస్ట్‌పై స్పందించగా.. జోయా అక్తర్, భూమి పెడ్నేకర్, సంజయ్ కపూర్ లాంటి చాలా మంది హార్ట్ ఎమోజీలను జతచేశారు.