నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన రీసెంట్ సినిమా “భగవంత్ కేసరి” తన కెరీర్ లో మరో మంచి హిట్ గా నిలిచినా సంగతి అందరికి తెలిసిందే. ఇక ఈ సినిమా తర్వాత బాలయ్య హీరోగా చేస్తున్న తన 109వ సినిమా కోసం కూడా అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమా న్ని దర్శకుడు కొల్లి బాబీ తెరకెక్కిస్తుండగా ఈ చిత్రం షూటింగ్ అయితే జెట్ స్పీడ్ లో కంప్లీట్ అవుతుంది.
అయితే ఈ సినిమా షూటింగ్ పై లేటెస్ట్ బజ్ తెలుస్తుంది. దీని ప్రకారం మేకర్స్ ఓ కీలకమైన షెడ్యూల్ ని రీసెంట్ గా రాజస్థాన్ లో ప్లాన్ చేయగా ఆ షూట్ లో అయితే బాలయ్య జాయిన్ కానున్నట్టుగా తెలుస్తోంది . అలాగే ఈ రానున్న కొన్ని రోజుల్లో సినిమా నుంచి ఓ సాలిడ్ అప్డేట్ కూడా మేకర్స్ రివీల్ చేసే ఛాన్స్ ఉందని తెలుస్తుంది. ఇక ఈ సినిమా కి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా సితార ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.