లేటెస్ట్: “కల్కి 2898 ఎడి” ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ ..!

Latest: “Kalki 2898 AD” OTT Release Date Fix ..!
Latest: “Kalki 2898 AD” OTT Release Date Fix ..!

పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా దీపికా అలాగే దిశా పటాని హీరోయిన్స్ గా దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించిన భారీ పాన్ ఇండియా హిట్ మూవీ “కల్కి 2898 ఎడి” కోసం అందరికీ తెలిసిందే. మరి పాన్ ఇండియా భాషల్లో వచ్చి థియేటర్స్ లో భారీ వసూళ్లు కొల్లగొట్టిన ఈ మూవీ ఓటీటీ రిలీజ్ ఎప్పుడెప్పుడా అని అభిమానులు ఏంటో ఆసక్తిగా ఎదురు చూస్తూ వస్తున్నారు.

Latest: “Kalki 2898 AD” OTT Release Date Fix ..!
Latest: “Kalki 2898 AD” OTT Release Date Fix ..!

ఈ నేపథ్యంలో ఈ మూవీ ఈ ఆగస్టులోనే రిలీజ్ కు వస్తుంది అని టాక్ వినిపించగా ఇపుడు ఫైనల్ గా దీనిపై అఫీషియల్ అప్డేట్ వచ్చేసింది. ఈ మూవీ ని ప్రముఖ స్ట్రీమింగ్ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో వారు సొంతం చేసుకోగా ఇందులో ఈ మూవీ ఈ ఆగస్ట్ 22 నుంచి అందుబాటులోకి రానున్నట్టుగా జస్ట్ ప్రైమ్ వీడియో వారు సర్ప్రైజింగ్ గా అనౌన్స్ చేసేసారు. మరి ఈ మూవీ అయితే హిందీ మినహా మిగతా పాన్ ఇండియా భాషల్లో రిలీజ్ కు తీసుకొస్తున్నట్టుగా ప్రైమ్ వీడియో వారు అనౌన్స్ చేశారు. మొత్తానికి అయితే కల్కి ఫైనల్ గా ఓటిటిలో అదరగొట్టేందుకు వస్తుంది అని చెప్పుకోవాలి .

https://x.com/PrimeVideoIN/status/1824649855807221981