మన టాలీవుడ్ మోస్ట్ ఎనర్జిటిక్ సీనియర్ హీరో మాస్ మహారాజ రవితేజ హీరోగా యంగ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్స్ హీరోయిన్ గా దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కించిన లేటెస్ట్ అవైటెడ్ మూవీ నే “మిస్టర్ బచ్చన్”. మరి సాలిడ్ బజ్ ఉన్న ఈ మూవీ ని హరీష్ శంకర్ తన మార్క్ లో తెరకెక్కించగా ఇప్పుడు మూవీ రిలీజ్ కు సిద్ధం చేస్తున్నారు.
మరి ఈ గ్యాప్ లోనే టీజర్ ట్రీట్ పై కూడా మేకర్స్ అధికారిక క్లారిటీ అందించగా ఇప్పుడు ఈ టీజర్ పై సాలిడ్ అప్డేట్ కూడా ఇచ్చేసారు. ఈ టీజర్ ను మేకర్స్ ఈ జూలై 28న రిలీజ్ చేస్తున్నట్టుగా అనౌన్స్ చేస్తూ రవితేజ, భాగ్యశ్రీ పై ఇంట్రెస్టింగ్ పోస్టర్ ను రివీల్ చేసి తెలిపారు. మరి ఇందులో ఇద్దరి డ్రెస్సింగ్ వింటేజ్ స్టైల్ లో కనిపిస్తుండగా ఇదిదేదో సాంగ్ కు సంబంధిచింది అన్నట్టుగా కనిపిస్తుంది.

ఆల్రెడీ బచ్చన్ షో రీల్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే కేజీయఫ్ ఎడిటర్ తో హరీష్ శంకర్ ఈ మూవీ టీజర్ ను కట్ చేయించడం దాని విషయంలో హ్యాపీగా ఉన్నానని చెప్పడం కూడా జరిగింది. మరి రేపు రానున్న ఏఈ టీజర్ ఎలా ఉంటుందో చూడాల్సిందే. ఇక ఈ మూవీ ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు నిర్మాణం వహించగా ఈ ఆగస్ట్ 15న మూవీ రిలీజ్ కు రాబోతుంది.
Bachchan Saab ka time shuru
MASSively Entertaining #MrBachchanTeaser out tomorrow
#MrBachchan GRAND RELEASE WORLDWIDE ON AUGUST 15th
Special Premieres on August 14th.#MassReunion
Mass Maharaaj @RaviTeja_offl #BhagyashriBorse @harish2you @vishwaprasadtg… pic.twitter.com/LsUm1ej3JA— People Media Factory (@peoplemediafcy) July 27, 2024