నాని “సరిపోదా శనివారం” నుంచి లేటెస్ట్ అప్డేట్.!

Latest update from Nani “Saripoda Sanivaram”!
Latest update from Nani “Saripoda Sanivaram”!

రెండు వరుస సాలిడ్ హిట్స్ తర్వాత నాచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న అవైటెడ్ మూడో మూవీ నే “సరిపోదా శనివారం”. మరి దర్శకుడు వివేక్ ఆత్రేయ తెరకెక్కిస్తున్న ఈ సాలిడ్ అకేషన్ డ్రామాలో ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా నటిస్తుండగా వెర్సటైల్ నటుడు దర్శకుడు ఎస్ జే సూర్య విలన్ గా నటిస్తున్నాడు . అయితే ఈ మూవీ నుంచి ఇపుడు వరుస అప్డేట్స్ వస్తున్నా సంగతి అందరికి తెలిసిందే. మరి అలా ఇప్పుడు కూడా మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ ను మేకర్స్ రివీల్ చేశారు.

Latest update from Nani “Saripoda Sanivaram”!
Latest update from Nani “Saripoda Sanivaram”!

మరి దీనితో మేకర్స్ ఉల్లాసం సాంగ్ ప్రోమోను రిలీజ్ చేసారు. ఇందులో నాని, ప్రియాంక మోహన్ ల నడుమ మంచి సీన్స్ కనిపిస్తుండగా జేక్స్ బిజోయ్ మ్యూజిక్ మంచి బీట్స్ ను అందించాడు. ఇక దీనితో ఈ సాంగ్ ఈ సాయంత్రం 6 గంటల 3 నిమిషాలకి రిలీజ్ చేస్తున్నట్టుగా ఫిక్స్ చేశారు మేకర్స్ . మరి ఈ ఫుల్ సాంగ్ ఎలా ఉంటుందో అనేది చూడాలి. ఇక ఈ మూవీ ని డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణం వహిస్తుండగా ఈ ఆగుస్ట్ 29న మూవీ పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కాబోతుంది.