విజ‌య్ ‘GOAT’ మూవీ నుండి లేటెస్ట్ అప్డేట్..!

Latest update from Vijay's 'GOAT' movie..!
Latest update from Vijay's 'GOAT' movie..!

తమిళ స్టార్ హీరో విజ‌య్ న‌టిస్తున్న తాజా మూవీ కి ‘GOAT’ – ‘గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’ అనే టైటిల్ ని ఫిక్స్ చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ మూవీ ను ద‌ర్శ‌కుడు విక్ర‌మ్ ప్ర‌భు డైరెక్ట్ చేస్తుండ‌టంతో ఈ మూవీ పై భారీ అంచ‌నాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఈ మూవీ ను పూర్తి యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్ గా చిత్ర యూనిట్ తెర‌కెక్కిస్తోంది.

Latest update from Vijay's 'GOAT' movie..!
Latest update from Vijay’s ‘GOAT’ movie..!

కాగా, ఈ మూవీ నుండి తాజాగా ఒక సాలిడ్ అప్డేట్ ఇచ్చారు మేక‌ర్స్. ‘GOAT’ మూవీ నుండి సెకండ్ సింగిల్ సాంగ్ “చిన్న చిన్న కంగ‌ల్”ని జూన్ 22న సాయంత్రం 6 గంట‌ల‌కి రిలీజ్ చేస్తున్న‌ట్లు మేక‌ర్స్ తెలిపారు. ఈ మూవీ కు యువ‌న్ శంక‌ర్ రాజా సంగీతం అందిస్తున్నారు.

ఇక ‘GOAT’ సినిమా లో విజ‌య్ తో పాటు ప్ర‌భుదేవా, ప్ర‌శాంత్, అజ్మ‌ల్ అమీర్ ఇత‌ర ముఖ్య పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. అందాల భామ మీనాక్షి చౌద‌రి ఈ మూవీ లో హీరోయిన్ గా న‌టిస్తోంది. ఈ మూవీ ని AGS ఎంట‌ర్టైన్మెంట్స్ బ్యాన‌ర్ అత్యంత భారీ బ‌డ్జెట్ తో ప్రొడ్యూస్ చేస్తోంది.