బంగారం ధర రోజు రోజుకి పైకి పరిగెడుతుంది. పసిడి రేటు క్రమ క్రమంగా పైకి కదులుతోంది. బంగారం ధర నేడు కూడా పరుగులు పెట్టింది. బంగారం ధర పెరగడం ఇది వరుసగా మూడో రోజు. పసిడి ప్రేమికులకు ఇది చేదు వార్తా అని చెప్పుకోవాలి. బంగారం ధరతో పాటు వెండి ధర కూడా అదే దారిలో పయనించింది. దేశ రాజధాని న్యూఢిల్లీ బులియన్ జేవేల్లెరి మార్కెట్లో ఆగస్టు 11న రూ.46,219గా ఉన్న 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర నేటి వరకు సుమారు రూ.800 పెరిగి రూ.47,039కు చేరుకుంది. అలాగే, ఆభరణాల తయారీలో వాడే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.400 పెరిగి రూ.43,088కు చేరుకుంది.
ఇక హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. కానీ, ఆగస్టు 12 నుంచి నేటి వరకు పుత్తడి ధర రూ.660 పైగా పెరిగింది. స్వచ్చమైన 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర ₹48,010గా ఉంది. ఇక ఆభరణాల తయారీలో వాడే 22 క్యారెట్ల బంగారం ధర ₹44,000గా ఉంది. బంగారం పెరిగితే వెండి ధరలు కూడా పెరిగాయి. నేడు కేజీ వెండి ధర రూ.62,416 నుంచి రూ.63,047కు పెరిగింది. బంగారం, వెండి ధరలు అనేవి ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు, బాండ్ ఈల్డ్ వంటి పలు అంశాలు చేత ప్రభావం చెందుతాయి.