‘అఖండ 2’ పై తాజా అప్ డేట్…!

Latest update on 'Akhanda 2'...!
Latest update on 'Akhanda 2'...!

బాలయ్యబోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన అఖండ మూవీ అద్భుత విజయాన్ని సాధించింది. దీంతో ‘అఖండ 2’ పై భారీ అంచనాలు కూడా నెలకొన్నాయి. ఐతే, ఈ మూవీ షూటింగ్ ఎప్పుడు అంటూ బాలయ్య ఫ్యాన్స్ పోస్ట్ లు పెడుతున్నారు. ప్రస్తుతం ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ చివరి దశలో ఉంది. డిసెంబర్ లో ఈ మూవీ షూటింగ్ ని స్టార్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ షెడ్యూల్ లో బాలయ్య పాత్ర తాలూకు పరిచయ షాట్స్ ని తీస్తారట.

Latest update on 'Akhanda 2'...!
Latest update on ‘Akhanda 2’…!

మొత్తానికి ఈ మూవీ కోసం బాలయ్య ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బోయపాటి శ్రీను ఇప్పటికే ‘అఖండ 2’ స్క్రిప్ట్ పూర్తి చేశారు . ప్రస్తుతం డైలాగ్ వెర్షన్ పై కసరత్తులు చేస్తున్నారు. కాగా ‘అఖండ 2’ లో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ కూడా ఒక కీలక పాత్రలో నటించబోతునట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బాలయ్య.. డైరెక్టర్ బాబీతో మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే.