‘బాలయ్య – బాబీ’ మూవీ పై లేటెస్ట్ అప్ డేట్….!

Latest update on 'Balaiya - Bobby' movie....!
Latest update on 'Balaiya - Bobby' movie....!

నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బాబీ కాంబినేషన్‌ లో ఒక మూవీ రాబోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ మూవీ క్లైమాక్స్ సీక్వెన్స్ ను శరవేగంగా షూట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ భారీ యాక్షన్ సీక్వెన్స్ లో బాలయ్యతో పాటు ఊర్వశి రౌటేలా, బాబీ డియోల్, చాందిని చౌదరి కూడా జాయిన్ అయినట్లు తెలుస్తుంది . ఈ యాక్షన్ ఎపిసోడ్ వెరీ పవర్ ఫుల్ గా ఉంటుందని టాక్. పైగా బాలయ్యతో పాటు బాబీ డియోల్ లుక్ కూడా చాలా వైల్డ్ గా ఉంటుందంట .

Latest update on 'Balaiya - Bobby' movie....!
Latest update on ‘Balaiya – Bobby’ movie….!

అందుకే, మూవీ మొత్తంలోనే మెయిన్ హైలైట్స్ లో ఈ క్లైమాక్స్ సీక్వెన్సే హైలైట్ గా ఉంటుందట. ఏది ఏమైనా ఈ మూవీ కోసం బాలయ్య ఫ్యాన్స్ రెట్టింపు ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై నాగ వంశీ, ఫార్చూన్‌ ఫోర్ మూవీ పై సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ మూవీ కి థమన్ సంగీతం అందిస్తున్నారు. కాగా ఈ మూవీ లో బాలయ్య పాత్ర నెవ్వర్ బిఫోర్ అనే రేంజ్ లో ఉంటుందని తెలుస్తోంది.