యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ హీరోయిన్ గా దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తున్న మాసివ్ యాక్షన్ డ్రామా “దేవర” అందరికీ తెలిసిందే. మరి నీట్ నేపథ్యంలో హాలీవుడ్ లెవెల్ హంగులతో తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై అనేక అంచనాలు నెలకొనగా మేకర్స్ కూడా ఎప్పటికప్పుడు సాలిడ్ అప్డేట్స్ ని అయితే రివీల్ చేస్తున్నారు. ఇక ఇదిలా ఉండగా ఈ మూవీ పై అయితే లేటెస్ట్ అప్డేట్ ఒకటి తెలుస్తుంది.
రీసెంట్ గానే మేకర్స్ గోవా లో ఓ ఇంట్రెస్టింగ్ షెడ్యూల్ ని తారక్ మరియు జాన్వీ లపై స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. మరి ఈ షెడ్యూల్ ని అయితే వారు సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసి వెనక్కి వచ్చేశారంట . ఇక నెక్స్ట్ షెడ్యూల్ ని మేకర్స్ త్వరలోనే స్టార్ట్ చేయనున్నారు. ఇక ఈ భారీ చిత్రానికి అనిరుద్ సంగీతం అందిస్తుండగా ఎన్టీఆర్ ఆర్ట్స్ మరియు యువసుధ ఆర్ట్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.