మెగాస్టార్ ‘విశ్వంభర’ పై తాజా అప్ డేట్..!

Latest update on Megastar 'Vishwambhara'..!
Latest update on Megastar 'Vishwambhara'..!

మెగాస్టార్ చిరంజీవి హీరోగా యంగ్ దర్శకుడు వశిష్ట ‘విశ్వంభర’ అనే మూవీ ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ లో హీరోయిన్ గా త్రిష నటిస్తోంది. ఐతే, ఈ మూవీ లో మరో సీనియర్ హీరోయిన్ కూడా నటించే అవకాశం ఉన్నట్లు గతంలోనే కొన్ని వార్తలు వచ్చాయి. కథ ప్రకారం సెకండ్ హాఫ్ లో వచ్చే ఈ పాత్ర మూవీ లో కీలక పాత్ర అని.. ఇప్పుడు ఈ పాత్ర కోసం ఖుష్బూ సుందర్ ని తీసుకున్నారని టాక్ నడుస్తుంది .

Latest update on Megastar 'Vishwambhara'..!
Latest update on Megastar ‘Vishwambhara’..!

నిజానికి ఈ పాత్ర కోసం సీనియర్ హీరోయిన్ విజయశాంతిని తీసుకుంటున్నారని వార్తలు కూడా వచ్చాయి. కానీ, తాజాగా ఖుష్బూ సుందర్ పేరు బాగా వినిపిస్తోంది. ఈ మూవీ లో మెగాస్టార్ ని ఫ్యాన్స్ ఎలా చూడాలి అనుకుంటున్నారో.. ఆయన పాత్ర అలాగే ఉంటుందట. అలాగే, ఈ మూవీ లో అద్భుతమైన ఫాంటసీ డ్రామా కూడా ఉంటుందట. UV క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ విశ్వంభర మూవీ కు కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ మూవీ జనవరి 10, 2025న విడుదల కాబోతుంది.