“మిస్టర్ బచ్చన్‌” లో సిద్ధు గెస్ట్ రోల్ పై లేటెస్ట్ అప్డేట్ !

Latest update on Sidhu's guest role in "Mr. Bachchan"!
Latest update on Sidhu's guest role in "Mr. Bachchan"!

మాస్ మహారాజ రవితేజ హీరోగా తెరకెక్కిన మిస్టర్ బచ్చన్ మూవీ ఆగస్టు 15న గ్రాండ్ రిలీజ్ కానున్నది . మూవీ రిజల్ట్ పై టీమ్ చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నందున, వారు ఆగస్టు 14న పెయిడ్ ప్రీమియర్‌లతో ప్రేక్షకుల ముందుకు కూడా రానున్నారు. రవితేజ నటిస్తున్న ఈ మూవీ లో యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ కనిపిస్తాడని కొన్ని రోజుల క్రితం ఆన్‌లైన్‌లో ఒక పుకారు వచ్చింది.

లేటెస్ట్ బజ్ ప్రకారం, మూవీ సెకండాఫ్‌లో సిద్ధు జొన్నలగడ్డ ఫైట్ సీక్వెన్స్‌లో కనిపిస్తారు . దాదాపు రెండు మూడు నిమిషాల పాటు సిద్ధు క్యామియో ఉంటుందని అంటున్నారు. హరీష్ శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ లో రవితేజకు జోడీగా భాగ్యశ్రీ బోర్సే నటించింది. జగపతిబాబు కీలక పాత్రలో నటించిన ఈ మూవీ కి మిక్కీ జే మేయర్ సంగీతం అందించాడు.