‘స్పిరిట్‌’ స్క్రిప్ట్ పై తాజా అప్డేట్ ….!

Latest update on 'Spirit' script....!
Latest update on 'Spirit' script....!

దర్శకుడు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా ‘స్పిరిట్‌’ అనే మూవీ చేయబోతున్నాడు. ఐతే, ఈ క్రేజీ మూవీ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ?, ఎప్పుడు రిలీజ్ అవుతుంది ? అని అంటూ ప్రభాస్ ఫ్యాన్స్ తెగ ఆసక్తి చూపిస్తున్నారు. తాజాగా వినిపిస్తున్న అప్ డేట్ ప్రకారం సందీప్ రెడ్డి ఈ మూవీ స్క్రిప్ట్‌ పూర్తి చేసినట్లు తెలుస్తుంది . ఈ చిత్ర కథలో ప్రభాస్ పాత్ర వైల్డ్ ఎలిమెంట్స్ తో బోల్డ్ గా సాగుతుందని, పైగా ప్రభాస్ డ్యూయెల్ రోల్ లో కనిపించబోతున్నాడని టాక్ వస్తుంది .

Latest update on 'Spirit' script....!
Latest update on ‘Spirit’ script….!

పైగా ఇప్పటికే, ఈ మూవీ లో ప్రభాస్ పవర్ ఫుల్ మాఫియా డాన్ గా కనిపిస్తాడని, ముఖ్యంగా ప్రభాస్ పాత్రలోని డెప్త్ కూడా నెవ్వర్ బిఫోర్ అనే రేంజ్ లో ఉంటుందని వార్తలు కూడా వచ్చాయి. అన్నట్టు ప్రభాస్ నుంచి ప్రేక్షకులు ఏదైతే బలంగా కోరుకుంటున్నారో అదే ఈ మూవీ లో ఉంటుందట. దాదాపు రూ.400 కోట్లకి పైగా బడ్జెట్‌ తో ఈ మూవీ తెరకెక్కనుంది. ప్రస్తుతం ప్రభాస్ రాజాసాబ్ మూవీ పూర్తి చేసే పనిలో ఉన్నారు .