సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా ఇప్పుడు రెండు మూవీ లు చేస్తున్న సంగతి తెలిసిందే. అందులో ఆల్రెడీ “వేట్టయన్” ఈ దసరా కానుకగా రిలీజ్ కు కూడా రాబోతుంది. అయితే రీసెంట్ గానే ఈ మూవీ గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా జరుపుకుంది. కానీ ఈ వెంటనే రజినీకాంత్ ఆరోగ్యం బాగాలేదు హాస్పిటల్ లో జాయిన్ అయ్యారు అనే వార్త అభిమానులను కంగారు పెట్టింది.
అయితే రజిని ఆరోగ్యానికి సంబంధించి ఇప్పుడు ఒక సమాచారం తెలుస్తుంది. రజిని ఆరోగ్యం నిలకడగానే ఉండడంతో ఇప్పుడు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ కూడా అయ్యారట. అయ్యి ఇంటికి కూడా వెళ్లారని తెలుస్తుంది . కాకపోతే కొన్ని రోజులు రెస్ట్ అవసరం అని వైద్యులు చెప్పారంట . సో తలైవర్ విషయంలో ఎలాంటి కంగారు పడాల్సిన పని లేదని చెప్పుకోవాలి . ఇక రజిని ఈ మూవీ తర్వాత లోకేష్ కనగరాజ్ తో “కూలీ” అనే మరో భారీ మూవీ చేస్తుండగా ఇందులో అక్కినేని నాగార్జున సాలిడ్ రోల్ చేస్తున్నాడు .