‘హరిహర వీరమల్లు’ ఫస్ట్ సాంగ్ పై లేటెస్ట్ అప్ డేట్..!

Latest update on the first song of 'Harihara Veeramallu'..!
Latest update on the first song of 'Harihara Veeramallu'..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్హరిహర వీరమల్లు’ మూవీ షూటింగ్ ను తిరిగి స్టార్ట్ చేసిన సంగతిఅందరికి తెలిసిందే. మార్చి 28న, 2025న గ్రాండ్ గా ఈ మూవీ రిలీజ్ కాబోతుంది. ఐతే, ఈరోజు ఈ మూవీ కొత్త షెడ్యూల్ షూటింగ్ ప్రారంభమవుతుంది. ఈ మూవీ లోని కీలక తారాగణం ఈ షెడ్యూల్ లో పాల్గొనబోతున్నారు. అన్నట్టు ఈ మూవీ నుండి మొదటి సింగిల్‌ని విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. దీపావళి శుభ సందర్భంగా విడుదల చేయాలని మేకర్స్ అందరూ ప్లాన్ చేస్తున్నారు. ఇందుకు సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన కూడా వచ్చే అవకాశం ఉంది. ఈ పాట తెలుగు వెర్షన్‌కి పవన్ కళ్యాణ్ స్వయంగా తన గాత్రాన్ని అందించడం విశేషం.

Latest update on the first song of 'Harihara Veeramallu'..!
Latest update on the first song of ‘Harihara Veeramallu’..!

కాగా డైరెక్టర్ జ్యోతి కృష్ణ దర్శకత్వంలో ఈ మూవీ రాబోతుంది. ఈ మూవీ లో నిధి అగర్వాల్ తో పాటు బాబీ డియోల్, సునీల్, రఘుబాబు, సుబ్బరాజు మరియు నోరా ఫతేహి ప్రధాన పాత్రల ల్లో నటిస్తున్నారు. ఈ మూవీ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎ దయాకర్ రావు నిర్మిస్తున్న ఈ మూవీ కి ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. అన్నట్టు క్రిష్ జాగర్లమూడి ఈ మూవీ లోని పలు సన్నివేశాలకు దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే.