గ్లోబల్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా కియారా అద్వానీ హీరోయిన్ గా దర్శకుడు శంకర్ కాంబినేషన్ లో భారీ పాన్ ఇండియా సినిమా “గేమ్ చేంజర్” ఇప్పుడు చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే. మరి ఎప్పటి నుంచో షూటింగ్ కొనసాగిస్తూ వెళ్తున్న ఈ సినిమా రీసెంట్ గా సరికొత్త షెడ్యూల్ ని మైసూర్ లో స్టార్ట్ చేసుకున్న సంగతి కూడా తెలిసిందే. చరణ్ కూడా రీసెంట్ గానే మైసూర్ లో అడుగు పెట్టగా ఇప్పుడు ఈ షెడ్యూల్ కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ .
దీని ప్రకారం ఇప్పుడు శంకర్ చరణ్ సహా నటుడు ఎస్ జె సూర్య మరియు 30 ఇయర్స్ పృథ్వీ సహా సునీల్ మరియు తదితర కొందరు కీలక నటులతో ముఖ్య సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారంట . మరి ఈ షూటింగ్ పార్ట్ కొన్ని రోజులు జరుగుతుందంట . ఇక ఈ భారీ సినిమా కి థమన్ సంగీతం అందిస్తుండగా దిల్ రాజు తమ బ్యానర్ లో 50వ చిత్రం గా అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు.