“విశ్వంభర” మూవీ పై లేటెస్ట్ అప్డేట్.!

Latest update on “Vishwambhara” movie.!
Latest update on “Vishwambhara” movie.!

టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా త్రిష హీరోయిన్ గా దర్శకుడు వశిష్ట తెరకెక్కిస్తున్న భారీ మూవీ “విశ్వంభర” కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ మూవీ మెగాస్టార్ కెరీర్ లో 156వ మూవీ గా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఇక ఇదిలా ఉండగా ఈ మూవీ విషయంలో అయితే మెగా ఫ్యాన్స్ చాలా ఎగ్జైటెడ్ గా ఎదురు చూస్తుండగా ఈ మూవీ షూటింగ్ సంబంధించి లేటెస్ట్ అప్డేట్ తెలుస్తుంది.

దీని ప్రకారం ప్రస్తుతం చిరు అలాగే యంగ్ హీరోయిన్ ఆషికా రంగనాథ్ నడుమ కొన్ని కీలక సన్నివేశాలని వశిష్ట తెరకెక్కిస్తున్నాడని తెలుస్తోంది . మూవీ లో ఈ సీక్వెన్స్ సీన్ కీలకంగా మారుతుంది అని టాక్. ఇక ఈ భారీ మూవీ ని విజువల్ వండర్ లా తెరకెక్కిస్తుండగా ఈ మూవీ సినిమాటోగ్రాఫర్ చోటా కే నాయుడు కి జన్మదిన శుభాకాంక్షలు మేకర్స్ తెలిపారు. ఇక ఈ మూవీ కి కీరవాణి సంగీతం అందిస్తుండగా యూవీ క్రియేషన్స్ వారు నిర్మాణం వహిస్తున్న సంగతి అందరికి తెలిసిందే. అలాగే వచ్చే ఏడాది జనవరి 10కి మూవీ ని తీసుకొస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు.