“విశ్వంభర” పై తాజా అప్డేట్…..!

Latest update on “Viswambhara”.....!
Latest update on “Viswambhara”.....!

మన టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా త్రిష హీరోయిన్ గా దర్శకుడు వశిష్ఠ తెరకెక్కించిన భారీ ఫాంటసీ యాక్షన్ డ్రామా మూవీ “విశ్వంభర” కోసం అందరికీ తెలిసిందే. మరి ఎన్నో అంచనాలు సెట్ చేసుకున్న ఈ మూవీ కోసం మెగా ఫ్యాన్స్ ఎప్పుడు నుంచో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ మూవీ షూటింగ్ అలాగే డబ్బింగ్, పోస్ట్ ప్రొడక్షన్ ఇలా అన్నీ ఏకకాలంలో జరిగిపోతున్నాయి.

Latest update on “Viswambhara”.....!
Latest update on “Viswambhara”…..!

ఇక ఈ మూవీ పై ఇపుడు లేటెస్ట్ అప్డేట్ తెలుస్తుంది. ప్రస్తుతం మూవీ లో రెండు పాటలు షూటింగ్ మినహా మిగతా అంతా కంప్లీట్ అయ్యిపోయినట్టుగా తెలుస్తుంది. ఇవి కూడా అతి త్వరలోనే కంప్లీట్ చేసేసి ఈ జనవరి బరిలోనే మూవీ ని దింపే సన్నాహాలు మేకర్స్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఈ మూవీ కి ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తుండగా యూవీ క్రియేషన్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మాణం వహిస్తున్నారు.