లావ‌ణ్య త్రిపాఠికి క‌లిసొచ్చే బేన‌ర్ గీతా ఆర్ట్స్

లావ‌ణ్య త్రిపాఠికి క‌లిసొచ్చే బేన‌ర్ గీతా ఆర్ట్స్

కొంద‌రు హీరోయిన్ల‌కు కొంద‌రు హీరోలు క‌లిసొస్తుంటారు. ఇంకొంద‌రు హీరోల‌కు కొంద‌రు ద‌ర్శ‌కులు క‌లిసొస్తారు. ఐతే లావ‌ణ్య త్రిపాఠికి ఒక నిర్మాణ సంస్థ బాగా క‌లిసొస్తుంది. ఆమె కెరీర్ స్ట్ర‌గుల్లో ఉన్న‌పుడ‌ల్లా ఆ బేన‌ర్లో సినిమా చేస్తే హిట్టొస్తుంది. మంచి పేరొస్తుంది. అవ‌కాశాలూ పెరుగుతాయి. ఆమెకు అంత‌గా క‌లిసొచ్చే బేన‌ర్ గీతా ఆర్ట్స్. ఈ సంస్థ‌లో ఆమె ఇంత‌కుముందు రెండు సినిమాలు చేసింది.

మంచి పేరు త‌ప్ప హిట్టే లేని స‌మ‌యంలో ఆమె ఈ బేన‌ర్లో భ‌లే భ‌లే మ‌గాడివోయ్ సినిమా చేసింది. అది ఎంత పెద్ద హిట్ట‌యిందో.. లావ‌ణ్య కెరీర్‌కు ఎలాంటి ఊపు తెచ్చిందో తెలిసిందే. ఆ త‌ర్వాత కొంచెం గ్యాప్ త‌ర్వాత‌ అదే బేన‌ర్లో చేసిన శ్రీర‌స్తు శుభ‌మ‌స్తు కూడా బాగా ఆడింది. ఆ త‌ర్వాత మ‌ళ్లీ ఈ బేన‌ర్లో లావ‌ణ్య సినిమా చేయ‌లేదు.

ఈ గ్యాప్ త‌ర్వాత లావ‌ణ్య మ‌ళ్లీ గీతా బేన‌ర్లో చావు క‌బురు చ‌ల్ల‌గా సినిమా చేయ‌నుంది. ఆర్ఎక్స్ 100 ఫేమ్ కార్తికేయ హీరోగా కౌశిక్‌ అనే కొత్ద ద‌ర్శ‌కుడు ఈ చిత్రాన్ని రూపొందించ‌నున్నాడు. లావ‌ణ్య రేంజికి కార్తికేయ‌తో జ‌ట్టు క‌ట్ట‌డం ఆశ్చ‌ర్య‌మే. కానీ ఆమెకు ఇంత‌కంటే మంచి అవ‌కాశాలేం రావ‌ట్లేదిప్పుడు. గ‌త రెండు మూడేళ్లుగా లావ‌ణ్య కెరీర్ ఏమాత్రం బాగా లేదు. వ‌రుస ఫ్లాపుల‌తో ఆమె అల్లాడిపోతోంది.

గ‌త ఏడాది చివ‌ర్లో లాంగ్ డిలేయ్డ్ మూవీ అర్జున్ సుర‌వ‌రం ఓ మోస్త‌రుగా ఆడింది. ప్ర‌స్తుతం ఆమె సందీప్ కిష‌న్ హీరోగా తెర‌కెక్కుతున్న ఎ-1 ఎక్స్‌ప్రెస్‌లో న‌టిస్తోంది. ఇది కాకుండా చేతిలో ఉన్న సినిమా చావు క‌బురు చ‌ల్ల‌గానే. మ‌రి గీతా ఆర్ట్స్ సెంటిమెంట్ క‌లిసొచ్చి లావ‌ణ్య హ్యాట్రిక్ కొట్టి త‌న కెరీర్‌ను మ‌రికొంత పొడిగించుకుంటుందేమో చూడాలి.