చిన్నారి పై దాడిచేసిన చిరుత‌పులి

చిన్నారి పై దాడిచేసిన చిరుత‌పులి

ఏడేళ్ల బాలిక‌పై చిరుత‌పులి దాడిచేసిన ఘ‌ట‌న ఉత్తరాఖండ్‌లోని తెహ్రీలో చోటుచేసుకుంది. దీంతో నెల రోజుల్లోనే చిరుత దాడిలో మ‌ర‌ణించిన చిన్నారులు సంఖ్య ఐదుకి చేరింది. వివ‌రాల ప్ర‌కారం..ఆదివారం రాత్రి 9:30 గంటల సమయంలో కాల‌కృత్యాల కోసం బాలిక బ‌య‌ట‌క వెళ్ల‌గా చిరుత‌పులి దాడిచేసింది. తీవ్ర‌గాయాల‌పాలైన చిన్నారి అక్క‌డిక్క‌డే ప్రాణాలు కోల్పోయించింద‌ని అటవీ విభాగం డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ డిఎస్ మీనా తెలిపారు.

బాలిక మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం కోసం తరలించామని ఆమె పేర్కొన్నారు. చిరుత దాడిలో గ్రామంలో ఇప్ప‌టివ‌ర‌కు ఐదుగురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. సెప్టెంబరు 24వతేదీన మొద‌టిసారి ఇంటిబ‌య‌ట ఆడుకుంటున్న బాలిక‌పై చిరుత దాడిచేసింది. వ‌రుస ఘ‌ట‌న‌ల నేపథ్యంలో ఇప్ప‌టికైనా అధికారులు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని త‌ల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.