Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
నమస్తే ఫ్రెండ్స్ …ఈ రోజు మరొక కొత్త విషయాన్ని మీతో పంచుకోడానికి వచ్చేసాను …మీరెప్పుడైనా గాలి లో తేలియాడే వస్తువులను కానీ, కర్రలను కానీ చూసారా…ఇళ్ళని నిర్మించేప్పుడు పునాదుల పైస్తంభాలనునిలబెడతాము,ఎందుకంటే అవి కూలిపోకుండా ఉండటానికి …ఇదే ఇంచు మించగా గుడుల కు , కూడా అన్వయిస్తాము కదా..మరి ఒక చోట మాత్రం గుడి కి ఆసరా గా వున్నా స్థంభం గాలొ నిలబడుతూ ఉంటుంది ఆండీ అది ఎలా సాధ్యం అని మీకే కాదు నాకు కూడా ఆశ్చర్యమే …మరి ఈ గుడి ఎక్కడ ఉంది అసలు అలా నిలబెట్టడం వెనుక ఏదైనా మాయ ఉందా ? మంత్రం ఉందా ? లేదా కేవలం శాస్త్ర పరిజ్ఞానమే నా …వివరాల్లో కి వెళ్దామా?
అధునాతనమైన సాంకేతిక ప్రరిజ్ఞానాన్ని సంపాదించుకున్నామని విర్రవీగుతున్నాం గాని కొన్ని వందల సంవత్సరాల క్రితమే అద్భుతమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని కలిగి శిల్ప కళా చాతుర్యం తో గుడి ని నిర్మాంచాము దానికి చక్కని ఉదాహరణ గా ఎన్నో గుడులు చూపించవచ్చు ..ఇప్పుడు మనం చెప్పుకునే గుడి విస్పష్టమైనది ఆ గుడి “లేపాక్షి” ఆలయం …నందీశ్వరుడు కొలువై ఉన్న క్షేత్రం …వీటి నిర్మాణం అద్భుతం ….వేలాడే స్తంభాలను మీరు ఇక్కడ చూడవచ్చు ..అదేంటి వేలాడే స్తంభం ఏమి ఆసరా లేకుండా ఉంటే నిర్మాణం కూలి పోదా అని సందేహం వస్తుంది కదా మరి అదే నిర్మాణం వెనుక అద్భుతం …ఎవరు కట్టించారు వీటిని ..మరి ?.
ఐదు వందల సంవత్సరాల చరిత్ర కలిగిన ఆలయం ఇది ..విజయనగర పాలకులు పరిపాలించిన కాలం లో కట్టబడింది. ఆలయ చరిత్ర గురించి టూకీ గా చెప్పుకుంటే శివ పార్వతుల వివాహానికి ప్రజలందరూ ఉత్తర పదానికి తరలి వెళ్లగా అక్కడ భూభారం పెరిగింది అట….అప్పుడు అసంఖ్యాక శిష్య పరమాణూవులు కలిగిన అగస్త్య మహా ముని ని దక్షిణానికి తరలి వెళ్ళమని ఆజ్ఞాపించారు ..ఎక్కడ వున్నా తమ కల్యాణాన్ని వీక్షించే వరాన్ని శివుడు మహా ముని కి ప్రసాదించడం తో అగస్త్య మహర్షి వింధ్య పర్వతాన్ని దాటారు ..తన దక్షణ దేశ పర్యటన లో భాగం గా ఎన్నో క్షేత్రాలలో నివసించి పూజ నిమిత్తం ఎన్నో లింగాలను ప్రతిష్టించారు ..అలాంటి ప్రదేశాలే దేవతా నివాస క్షేత్రాలు గా విలసిల్లాయి …అలాంటి వాటిల్లో ఒకటి లేపాక్షి ఆలయం …అగస్త్య మహా ముని తపమాచరించిన గుహ ఆలయ రెండవ ప్రాకారం లో ఇప్పటికి చూడవచ్చు .
కలియుగం లో ఈ ప్రాంతాన్ని పరిపాలించిన చోళ రాజు శ్రీ పాపనాశ్వర స్వామికి ఆలయాన్ని నిర్మించి శ్రీ తాండావేశ్వర స్వామిని రెండవ ప్రాకారం లో ప్రతిష్టించారని తెలుస్తుంది .నాలుగు కాళ్ళ మండపం లో శ్రీ తాండావేశ్వర లింగాన్ని ఇప్పటికి చూడవచ్చు ..ఇక ఈ క్షేత్రానికి లేపాక్షి అన్న పేరు రావడానికి వెనుక త్రేతాయుగానికి సంబందించిన గాద ఒకటి ఉంది …లంకాధీశుడు అయినా రావణాసురుడు సీతాదేవిని అపహరించుకొని వెళుతున్నప్పుడు జానకి దేవి విచారం తో ఆక్రందనలు చేస్తుంది …ఆ ఆక్రందనలు విన్న జటాయువు అన్న పక్షి రాజు అసుర రాజు అయినా రావణాసురుడు తో పోరాడి రెక్కలు తెగి పడిపోతుంది . దాహం తో అల్లాడుతున్న జటాయువు దాహం తీర్చడానికి భూదేవి తన రాతి పదాన్ని కొండా పై మోపి నీటిని రప్పించింది. దాహం తీర్చింది ..ఇప్పటికి వేసవి లో ఆ పదం లో తడి ఉండటాన్ని గమనించవచ్చు …సీతా దేవిని వెతుకుతూ వచ్చిన రాముడు, నేలకూలిన పక్షిని చూసి , “లే పక్షి ” అని సంబోదించాడట …సీతాదేవి ని దక్షణ దిశగా ఎత్తుకు పోయాడు అన్న విష్యం రాముడికి తెలిపి మరణిస్తుంది …పక్షి కి అంత్యక్రియ లు జరిపిన ప్రదేశాన్ని కూడా ఒక కిలోమీటర్ దూరం లో చూడొచ్చు ..అప్పటినుంచి ఈ క్షేత్రానికి లేపాక్షి అన్న పేరు వచ్చింది ..
ఇక నాట్య మండపం దగ్గర మూడు స్తంభాల పై ప్రతిష్టంచిన స్థంబాలు ఆనాటి శిల్ప కళా చాతుర్యానికి మచ్చుతునక అని చెప్పవచ్చు ..నాట్య మండపం పై కప్పు పై ఇంకా అనేక చిత్రాలని చిత్రించింది విజయనగర వాసులు మరియు కృష్ణా జిల్లావారు …శిల్పాలని చెక్కిన వీరన్న బొమ్మని కూడా చూడొచ్చు ..ఈ నాట్య మండపం ఈశాన్య భాగం లో ఒక అద్భుతాన్ని చూడొచ్చు …అదే వేలాడే స్థంభం (hanging pillar) వంద సంవత్సరాల క్రిందట ఆంగ్లేయుల పరిశోధకుల పరీక్షలో ఈ నాట్య మండపం మొత్తం ఒకే స్థంభం పైన నే ఆధారి పడే ఉంది అన్న విషయాన్ని గుర్తించారు అట ..వారు ఈ స్తంభాన్ని కదిలించాలని చూడగా మూడు స్తంబాలు కదిలాయట…అలా పక్కకి కదిలిన స్తoబాన్ని కూడా చూడొచ్చు ..నాటి శిల్ప కళా చాతుర్యానికి మచ్చుతునక …ఈ నాట్య మండపాన్ని కలుపుతూ పైన ఒక శతపత్ర కమలాన్ని అత్యంత సహజం గా ఏర్పరిచారు …కాల ప్రభావం మూలం గా కొంత శిధిల మైనప్పటికీ, ఇప్పటికి అందరి ని ఆకర్షిస్తుంది.
గర్భాలయం లో మూల విరాట్టు వీరభద్రస్వామి, గణేషుడు, రాముడు, లింగం, పాపనాశ్వరి స్వామి లింగం, పార్వతి, దుర్గ ఇంకా అనేక మూర్తులు కొలువై ఉన్నారు ..దీని తరువాత బసవయ్య విగ్రహాన్ని దర్శించడం ..మరిచిపోలేని అనుభూతి పదిహేను అడుగుల ఎత్తు, ఇరవై ఏడూ అడుగుల పొడవు , ముప్పై మీటర్ల చుట్టుకొలతలో కలిగి వున్నది ఈ విగ్రహం …మే డ ల; గంటలతో , రుద్రాక్షలతో బహు సుందరం గా ఉంటుంది ..అతి త్వరలో గిన్నెస్ బుక్ లోకి ఎక్కబోతున్న ఈ విగ్రహం పాత కాలం లో పోతులూరి బ్రహ్హం గారు చెప్పిన కాల జ్ఞానం లో రాసి ఉంది లేపాక్షి బసవన్న మోరలెత్తి రంకె వేయును అని …చాలా కాలం నిర్లక్ష్యం నీడ లో ఉన్న లేపాక్షి ఇప్పుడు ఇప్పుడే గత వైభవాన్ని పొందడానికి ప్రయత్నిస్తుంది …ఆలయం బయట ప్రాకారంలో ఏడు తలల నాగు పాము పడగల నీడలా ఆ శివలింగం కొలువై ఉండటాని మనం దర్శించుకోవచ్చు.
ఇక లేపాక్షి వెళ్లాలని అనుకుంటే అనంతపురం జిల్లాలో ని హిందూపురం పట్టణానికి దగ్గరలో నే ఉంది ..హిందూపురం నుంచి పదిహేను కిలోమీటర్ ల దూరం లో ఉంది ..ఇక్కడికి బస్సు మార్గం లో వెళ్లొచ్చు ..రైలు మార్గం లో అనంతపురం వరకు వచ్చి అక్కడనుంచి బస్సులో కూడా వెళ్లొచ్చు …
ఇదండీ లేపాక్షి సంగతులు ..!!