ప్రజా పంపిణీ వ్యవస్థను ప్రక్షాళన చేద్దాం: నాదెండ్ల

ప్రజా పంపిణీ వ్యవస్థలో లోపాలను సరిదిద్దడంతోపాటు ప్రజలకు మెరుగైన సేవలందించడంలో సివిల్‌ సప్లయిస్‌ జిల్లా మేనేజర్లు, సరఫరాల అధికారులదే కీలక పాత్ర అని మంత్రి నాదెండ్ల మనోహర్‌ చెప్పారు. గత ప్రభుత్వంలోని అలవాట్లను మానుకుని టీం స్పిరిట్‌తో పనిచేసి ప్రజా పంపిణీ వ్యవస్థను ప్రక్షాళన చేయాలని ఆదేశించారు. ఎండీయూ వాహనాలపై నిరంతర నిఘా, పర్యవేక్షణ ఉండాలన్నారు. విజయవాడలో బుధవారం నిర్వహించిన డీఎంలు, డీఎ్‌సవోల వర్క్‌షాప్‌లో మంత్రిమాట్లాడగా.. కమిషనర్‌ సౌరబ్‌గౌర్‌, ఎండీ మనజీర్‌ జిలానీ సమూన్‌ పాల్గొన్నారు.