సైనికులకు నైతిక మద్దతిద్దాం…

ap deputy cm pawan kalyan
ap deputy cm pawan kalyan

పాకిస్థాన్‌ మీద చేస్తున్న ధర్మయుద్ధానికి ప్రతిఒక్కరి నైతిక మద్దతు అవసరమని ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ అన్నారు. జనసేన పార్టీ తరఫున వచ్చే మంగళవారం ఉదయం తమిళనాడులోని తిరుత్తణి, తిరుచెందూర్‌, పళని, తిరుపరంకుండ్రమ్‌, స్వామిమలై, పలముదిర్చోళైల్లో ప్రతి క్షేత్రానికి ఒక జనసేన శాసనసభ్యుడిని, జనసైనికులను పంపించి ప్రత్యేక పూజలు చేయించాలని పార్టీ నాయకులను ఆదేశించారు. కర్ణాటకలోని కుక్కే, ఘాటీ సుబ్రహ్మణ్య క్షేత్రాలు, రాష్ట్రంలోని మోపిదేవి, బిక్కవోలులోని సుబ్రహ్మణ్య ఆలయాలు, ఇంద్రకీలాద్రిపై దుర్గామల్లేశ్వర ఆలయం, పిఠాపురం పురూహూతిక దేవి ఆలయాల్లో పూజలు చేయించాలని సూచించారు. సైన్యానికి సూర్యశక్తి తోడుండేలా వచ్చే ఆదివారం శ్రీకాకుళం జిల్లా అరసవల్లిలోని సూర్యనారాయణ స్వామి ఆలయంలో పూజలు చేయించనున్నారు. క్రైస్తవ ధర్మాన్ని విశ్వసించేవారు చర్చిల్లో, ఇస్లాం ధర్మాన్ని ఆచరించే వారు మసీదుల్లో ప్రార్థనలు చేపట్టాలని పవన్‌ కోరారు.