రాజస్థాన్ రాయల్స్ స్టార్ ఓపెనర్ ఎవిన్ లూయిస్ తన ఆల్-టైమ్ టీ20 ఫ్లేయింగ్ ఎలెవన్‌ను ఎంచుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియోను రాజస్థాన్ రాయల్స్ ట్విటర్‌లో పోస్ట్ చేసింది. తను ప్రకటించిన జట్టుకు టీమిండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనిని కెప్టెన్‌గా లూయిస్ ఎంచుకున్నాడు. అదే విధంగా.. యూనివర్స్‌ల్ బాస్ క్రిస్ గేల్, హిట్‌మ్యాన్ రోహిత్ శర్మకు ఓపెనర్లుగా అవకాశం ఇచ్చాడు.
ఇక రన్ మిషన్ విరాట్ కోహ్లికు మూడో స్ధానంలో, సౌతాఫ్రికా దిగ్గజ ఆటగాడు ఏబీ డివిలియర్స్‌కు నాలుగో స్ధానంలో చోటు దక్కింది. జట్టులో ఐదో స్థానంలో వెస్టిండీస్ కెప్టెన్ కీరన్ పొలార్డ్‌కు అవకాశం ఇచ్చాడు ఎవిన్ లూయిస్. భారత్‌కు 2007లో టీ20 ప్రపంచకప్ అందించిన ధోనీని తన టీమ్‌కి వికెట్ కీపర్‌గా, కెప్టెన్‌గా లూయిస్ ఎంచుకున్నాడు. ఆల్‌రౌండర్ కోటాలో ఆండ్రీ రస్సెల్, రవీంద్ర జడేజాకు చోటు కల్పించాడు. తన జట్టులో ఏకైక స్పిన్నర్‌గా రషీద్ ఖాన్‌ను లూయిస్ ఎంపిక చేశాడు. ఫాస్ట్ బౌలర్ల కోటాలో జస్ప్రీత్ బుమ్రా, మిచెల్ స్టార్క్‌కు తన జట్టులో లూయిస్ స్థానం కల్పించాడు.