మొత్తం తెలుగు రాష్ట్రాల్లో 276 పోస్టులతో లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా-LIC దేశవ్యాప్తంగా 8500 పైగా అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో 276 పోస్టుల. ఎల్ఐసీ అధికారిక వెబ్సైట్ లో నోటిఫికేషన్ చూడొచ్చు. సెంట్రల్, ఈస్టర్న్, ఈస్ట్ సెంట్రల్, నార్తర్న్, నార్తర్న్ సెంట్రల్, సదరన్, సౌత్ సెంట్రల్, వెస్టర్న్ జోన్లకి దాదాపు అన్ని జోన్లకు వేర్వేరుగా నోటిఫికేషన్లు విడుదల చేసింది. దరఖాస్తుకు ప్రారంభ తేదీ సెప్టెంబర్ 17,అక్టోబర్ 1 చివరి తేదీ.
ఎంపిక విధానం: ప్రిలిమినరీ ఎగ్జామ్, మెయిన్స్ ఎగ్జామ్, ప్రీ-రిక్రూట్మెంట్ మెడికల్ ఎగ్జామినేషన్.
- ప్రిలిమ్స్ ఎగ్జామ్ 100 మార్కులకు ఉంటుంది. పరీక్ష వ్యవధి 60 నిమిషాలు. ఇంగ్లీష్ లేదా హిందీ భాషలో 30 ప్రశ్నలు, న్యూమరికల్ ఎబిలిటీలో 35 ప్రశ్నలు, రీజనింగ్ ఎబిలిటీ 35 ప్రశ్నలుంటాయి.
- మెయిన్స్ ఎగ్జామ్ 200 మార్కులకు ఉంటుంది. పరీక్ష వ్యవధి 120 నిమిషాలు. జనరల్ / ఫైనాన్షియల్ అవేర్‌నెస్‌లో 40 ప్రశ్నలు, జనరల్ ఇంగ్లీష్‌లో 40 ప్రశ్నలు, క్వాంటిటీవ్ యాప్టిట్యూడ్‌లో 40 ప్రశ్నలు, రీజనింగ్ ఎబిలిటీ & కంప్యూటర్ యాప్టిట్యూడ్‌లో 40 ప్రశ్నలు, హిందీ భాషలో 40 ప్రశ్నలు ఉంటాయి.