లీటర్ రూ. 80 లోపు తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు

Petrol Diesel Price In India

అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు తగ్గుతుండడంతో, దేశవ్యాప్తంగా పెట్రోల్ మరియు డీజిల్ ధరలు మరోసారి తగ్గాయి. ఈ రోజు బుధవారం (నవంబర్ 28) ప్రకారం తెలుగు రాష్ట్రాల రాజధానులైన హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర 53 పైసలు తగ్గి రూ. 78 గా, డీజిల్ ధర 44 పైసలు తగ్గి రూ. 74.96 వద్ద స్థిరపడగా, విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర రూ. 77.38 గా, డీజిల్ ధర రూ. 73.49 లుగా వద్ద కొనసాగుతున్నాయి.

petrol-diesel-cm

దేశరాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర పైన 50 పైసలు తగ్గి రూ. 73.57 ఉండగా, డీజిల్ ధర పైన 40 పైసలు తగ్గి రూ. 68.49 గా ఉంది. దేశ వాణిజ్యరాజధాని అయిన ముంబై లో ఈ పెట్రోల్ మరియు డీజిల్ ధరలు వరుసగా రూ. 79.12 మరియు 71.71 లుగా ఉన్నాయి. అలాగే అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర మరోసారి దిగజారి బారెల్ 60.32 డాలర్లుగా ఉండగా, డబ్ల్యూటీఐ క్రూడ్ పిల్ ధర 51.27 డాలర్లుగా ఉంది. ఇలా రోజురోజుకి దిగివస్తున్న ధరలతో పెట్రోల్ మరియు డీజిల్ ధరలు రూ. 80 లోపే లభిస్తుండడం వినియోగదారులకి ఊరట కొలిపే విషయం అయినప్పటికీ, మళ్ళీ ధరలు అమాంతం పెరగకుండా కట్టడిచేయాలని వినియోగదారులు అభిప్రాయపడుతున్నారు.