హర్యానాలో దారుణం చోటు చేసుకుంది. రేవారి అనే గ్రామంలో ఓ ఖాళీ పాఠశాల భవనంలో పదేళ్ల బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. నిందితులు బాలికను గ్రామంలోని ఓ ఖాళీ పాఠశాల భవనానికి తీసుకెళ్లి అత్యాచారం చేసినట్టు తెలిపారు.
ఈ నేరాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారని పేర్కొన్నారు. కాగా వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో బాలిక కుటుంబం జూన్ 9న పోలీసులకు ఫిర్యాదు చేసిందని అన్నారు.
ఇక అత్యాచారానికి పాల్పడిన నిందితుల్లో ఐదుగురు మైనర్లు 10 నుంచి 12 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నట్టు పోలీసులు పేర్కొన్నారు. 5వ తరగతి చదువుతున్న బాలికను తన ఇంటి బయట ఆడుతుండగా నిందితులు ఆమెను కిడ్నాప్ చేసినట్టు వెల్లడించారు. కాగా పోలీసులు కేసు నమోదు చేసి నిందుతులను అరెస్ట్ చేశారు.