కరోనా కేసులు రోజురోజుకూ తీవ్రమవుతున్న నేపథ్యంలో తమిళనాడు సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. వివిధ ఆంక్షలతో ఆగస్టు 31 వరకు లాక్డౌన్ను పొడిగిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అంతేకాకుండా ఆదివారాల్లో పూర్తిస్థాయి లాక్డౌన్ ఉంటుందని ముఖ్యమంత్రి డప్పాడి కే పళనిస్వామి ఓ ప్రకటన విడుదల చేశారు. రాష్ర్టంలో శుక్రవారంతో లాక్డౌన్ గడువు ముగియనున్న నేపథ్యంలో వైద్యాధికారులు, ఆరోగ్యశాఖ ముఖ్య అధికారులతో అత్యవసర భేటి అయిన సీఎం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
రాష్ర్టంలో లాక్డౌన్ ఆంక్షలను కఠినతరం చేశారు. ర్కులు, బీచ్లు, సినిమాహాళ్లు, విద్యాసంస్థల బంద్ కొనసాగుతుందని వెల్లడించారు. అంతేకాకుండా అంతర్రాష్ట రవాణాపై నిషేధం కొనసాగనుందని సీఎం స్పష్టం చేశారు. ఇతర రాష్ర్టాల నుంచి వచ్చేవారికి ఈ-పాస్ లేనిదే అనుమతించమని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. తమిళనాడులో ఇప్పటివరకు 2,27,688 కరోనా కేసులు నమోదవగా ప్రస్తుతం 57వేల యాక్టివ్ కేసులున్నాయి.