లాక్ డౌన్ ను ఎత్తివేసే సమస్య లేదు

లాక్ డౌన్ ను ఎత్తివేసే సమస్య లేదు

ప్రస్తుతం భారత దేశంలో ఉన్న పరిస్థితుల రీత్యా ముఖ్యమంత్రులు, ప్రభుత్వం, అధికార యంత్రాంగం, ప్రముఖులు, ముఖ్యులు రెడ్ జోన్ లలో, హాట్ స్పాట్ లలో, కంటైన్మెంట్ ప్రకటించిన ప్రాంతాలలో మరింత కఠినంగా లాక్ డౌన్ అమలు చేయాలని చెబుతున్నారు అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం కూడా లాక్ డౌన్ ను పొడిగించే ఆలోచనలో ఉన్నది అనే విషయాన్ని వెల్లడించారు. కరోనా వైరస్ భారిన పడి చాలా మంది మరణించడం జరుగుతుంది. అలానే ఈ వైరస్ ను పూర్తి స్థాయిలో అరికట్టే బాధ్యత కూడా కేంద్రానికి ఉన్నది కాబట్టి లాక్ డౌన్ ను ఎత్తివేసే సమస్య లేదు అని తేల్చి చెప్పారు. లాక్ డౌన్ పొడిగించాల్సిన అవసరం ఉందని, అందరూ కూడా అదే కోరుతున్నారు అని కిషన్ రెడ్డి అన్నారు.

అయితే లాక్ డౌన్ నీ పొడిగించే అవకాశం ఉందని చెబుతూనే, దీని పై మెంటల్ గా ప్రిపేర్ కావాల్సి ఉంటుంది అని ప్రజలకు సూచించారు. ప్రాణాలు కాపాడుకోవాలంటే కేంద్ర ప్రభుత్వం తీసుకొనే చర్యలు అర్దం చేసుకోవాలని అన్నారు. ఎక్కడికి వెళ్ళినా సామాజిక దూరం పాటించాలని, మాస్క్ లు ధరించాలని, లాక్ డౌన్ ను తప్పక పాటించాలని ప్రజలను కోరారు. కరోనా ఎక్కువగా ప్రభావం ఉన్న చోట, అంటే పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదు అయ్యే ప్రాంతాల్లో, కరోనా మరణాలు సంభవించే ప్రాంతాల్లో ఎలాంటి సడలింపు లు ఉండవు అని వ్యాఖ్యానించారు. అంతేకాక అలాంటి ప్రాంతాల్లో మరింత కఠినంగా లాక్ డౌన్ అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది అని వ్యాఖ్యానించారు. అయితే మే 3 తర్వాత పూర్తిగా లాక్ డౌన్ అమలు ఉండకపోయినా గ్రీన్ జోన్ ప్రాంతాలలో కొంత మేరకు, అది కూడా సామాజిక దూరం పాటించే అవకాశం ఉన్న ప్రాంతాలలో సడలింపు లు ఇచ్చామని వివరించారు.